హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువ డ్యాన్సర్ దారుణ హత్యను పోలీసులు చేధించారు. సంచలనంగా మారిన ఈ ఉదంతాన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ముప్ఫై ఏళ్ల చిన్న వయసులోనే భర్తను కోల్పోయి.. ఏడుగురు పిల్లల తల్లైన మహిళ దారుణంగా హత్యకు గురి కావటం.. అర్థనగ్నంగా పడి ఉండటం సంచలనంగా మారింది. హత్యకు దారి తీసిన కారణాలేంటి? ఎవరు హత్య చేశారు? లాంటి సవాళ్లను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెళ్లిళ్లు.. శుభకార్యాల్లో డ్యాన్సులు చేసే డ్యాన్సర్ గా సుపరిచితురాలైన బాధితురాలు (30) అనుమానస్పద రీతిలో మరణించటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ షురూ చేశారు. పెళ్లైన కొంతకాలానికే మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన బాధితురాలు.. కొన్నేళ్ల క్రితం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెకు మొత్తంగా ఏడుగురు పిల్లలు. ఇదిలా ఉంటే.. ఏడాది క్రితం రెండో భర్త అనారోగ్యంతో మరణించాడు.
అనంతరం కొద్ది కాలానికి చంచల్ గూడకు చెందిన కారు డ్రైవర్ మహ్మద్ అప్సర్ (30)తో ఆమెకు పరిచయమైంది. కొన్నాళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర్ ను ఆమె కోరుతోంది. అందుకు సమాధానం చెప్పని అప్సర్ మీద ఆమె ఒత్తిడి తీసుకొస్తోంది.
ఇదిలా ఉంటే.. బాధితురాలు డ్యాన్స్ మానేస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని అప్సర్ చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఇదిలా ఉండగా.. బాధితురాలు ఈ మధ్యనే తన పాత ఇంటిని వదిలి.. కొత్తిల్లు తీసుకోవటం.. పాత ఇంట్లో సామాన్లను తీసుకురావటం కోసం వెళుతున్నట్లుగా పిల్లలకుచెప్పి వెళ్లింది. ఇదే సమయంలో ఆమెను కలవటానికి అప్సర్ తన మిత్రుడైన 22 ఏళ్ల మహ్మద్ నహెద్ తో కలిసి వెళ్లాడు.
అక్కడ కొద్దిసేపటి తర్వాత వారిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన రావటం.. అది కాస్తా వాగ్వాదంగా మారటంతో కోపంతో డ్యాన్సర్ గొంతు నులిమి చంపేశాడు అప్సర్. అతడి వెంట వెళ్లిన మహ్మద్ నహెద్ చున్నీతో ఉరి బిగించినట్లుగా గుర్తించారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు. తల్లిని కోల్పోయిన ఏడుగురు పిల్లలు తల్లి కోసం పడుతున్న తపన చూపురులను కలిచివేస్తోంది.