ప్రపంచవ్యాప్తంగా పాపులర్ క్రిప్టోకరెన్సీ అయిన బిట్ కాయిన్ గత ఏడాది ఏకంగా 2000 శాతం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో - చాలామంది ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎగబడ్డారు. అయితే, ప్రస్తుతం ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న చందంగా ఉంది బిట్ కాయిన్ పరిస్థితి. గత ఏడాది తారాజువ్వలా దూసుకుపోయిన బిట్ కాయిన్ విలువ కొన్ని వారాల నుంచి క్షీణిస్తోంది. 2017 డిసెంబర్ లో 19,800 డాలర్లుగా నమోదైన బిట్ కాయిన్ విలువ 2018 జనవరి చివరి నాటికి 10వేల డాలర్లకు పతనమైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిట్ కాయిన్ - క్రిప్టో కరెన్సీని అధికంగా వాడే దక్షిణ కొరియా - చైనాలాంటి దేశాలు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ను నిషేధిస్తాయన్న వార్తల నేపథ్యంలో ఈ క్షీణత సంభవిస్తోంది. క్రిప్టోకరెన్సీలపై భారత్ తో పాటు వివిధ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడమే కాకుండా క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ చర్యలు కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో బిట్ కాయిన్స్ సహా క్రిప్టోకరెన్సీలన్నీ చట్టవిరుద్ధమనీ - వాటిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించిన విషయం విదితమే. దీంతో, భారత్ లో రూ 6,44,042గా ఉన్న బిట్ కాయిన్ విలువ శుక్రవారం మధ్యాహ్నానికి రూ.5,44,735కు పడిపోయింది. దాంతోపాటు బిట్ కాయిన్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి జైట్లీ తాజాగా మరో షాక్ ఇచ్చారు.
బిట్ కాయిన్స్ లో పెట్టుబడులు పెట్టిన కొన్ని లక్షల మందికి నోటీసులు జారీ చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్ర సంచలన ప్రకటన చేశారు. వారి నుంచి పన్నులు వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. బిట్ కాయిన్స్ పై అడ్వాన్స్ ట్యాక్స్ లు చెల్లించడం లేదన్నారు. ఆ పెట్టుబడులను తమ పన్నురిటర్న్స్ లో పొందుపరచలేదన్నారు. గత ఏడాది బిట్ కాయిన్ విలువ ఉచ్ఛ దశలో ఉన్నపుడు లావాదేవీలు నిర్వహించిన ఎక్స్ఛేంజ్ లపై దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించి సమాచారాన్ని సేకరించామన్నారు. బిట్ కాయిన్స్ లో పెట్టుబడులు పెట్టి ఆ వివరాలను వెల్లడించని వారి నుంచి పన్నులు రాబడతామని, పన్నులు చెల్లించేందుకు చాలామంది ఇన్వెస్టర్లు అంగీకరించారని తెలిపారు. ఇప్పటికే కొన్ని లక్షల మందికి నోటీసులు జారీ చేశామని, త్వరలోనే మరింతమందికి జారీ చేసేందుకు సిద్ధమవుతున్నామని అన్నారు.