హైస్పీడ్ రైల్వే కోసం 6 కారిడార్ల గుర్తింపు ...తెలుగు రాష్ట్రాల నుండి ఎన్నంటే !
అతి త్వరలో గంటకు మూడు వందల కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ ట్రైన్లు దేశ వ్యాప్తంగా పరుగులు తియనున్నాయి. ఇప్పటికే దీనికోసం ప్రత్యేకంగా రైల్వేశాఖ ఆరు కారిడార్లని గుర్తించింది. అందులో ముంబై–పుణే–హైదరాబాద్ కారిడార్ కూడా ఒకటి కావడం విశేషం. ఈ ఆరు కారిడార్లలో హైస్పీడ్, సెమీ హైస్పీడ్ కారిడార్లుగా.. ఆరు సెక్షన్ల ను గుర్తించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.. హైస్పీడ్ కారిడార్ లో రైళ్లు గంటకు 300 కి.మీ.ల వేగంతో, సెమీస్పీడ్ కారిడార్‌లో 160 కిలో మీటర్ల వేగం తో నడవనున్నాయి.
దీనికి సంబంధించి కావాల్సిన స్థల సేకరణ, అలైన్ మెంట్ వంటి అంశాల ఆధారంగా.. ఎంతవరకు సాధ్యమవుతుందన్నదానిపై డీపీఆర్ రూపకల్పన చేస్తామని వివరించారు. ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ తొలి హైస్పీడ్ కారిడార్ గా గుర్తించారు. ఈ మార్గంలో 2023 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి.. దాదాపు తొంభై శాతం స్థల సేకరణ పూర్తవుతుదంని.. మొత్తంగా 1,380 హెక్టర్లు ఇందుకోసం అవసరమవుతుందని అంచనా వేశారు.
హైస్పీడ్ రైల్వే కోసం గుర్తించిన ఆ 6 కారిడార్లు ఇవే..
1. ఢిల్లీ-నోయిడా-ఆగ్రా-లక్నో-వారణాశి (865 కి.మీ.)
2. ఢిల్లీ-జయ్‌పూర్-ఉదయ్‌పూర్-అహ్మదాబాద్ (886 కి.మీ)
3. ముంబయి-నాసిక్-నాగ్‌పూర్ (753 కి.మీ)
4. ముంబయి-పుణె-హైదరాబాద్ (711 కి.మీ)
5. చెన్నై-బెంగళూరు-మైసూరు (435 కి.మీ)
6. ఢిల్లీ-చండీగఢ్-లుథియానా-జలంధర్-అమృతసర్ (459కి.మీ).