మానవుల విజ్ఞానానికి పరిమితిలేదు-అంటారు. అయితే.. కొన్ని కొన్ని విషయాల్లో మూర్ఖంగా ఆలోచించేవారికి కూడా ఇది అతికినట్టు సరిపోతుంది! పైగా అత్యంత కీలకమైన సమయంలో.. ఇలాంటి వారే చేసే `ప్రబోధం` మరింత వెగటు పుట్టిస్తుంది. ఏ మాత్రం ఆధారాలు లేకుండానే.. అదిగో పులి.. అంటే.. ఇదిగో తోక అనే టైపు మనుషులు పెరిగిపోయారు. నిజానికి ప్రస్తుతం దేశంలో కరోనా విలయం ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలిసిందే. ఈ సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పడం.. వారికి సరైన సూచనలు అందించడం అనేది కీలకం.
అయితే, దీనికి విరుద్ధంగా.. మూఢనమ్మకాలు.. సహా అనేక పిడివాదాలు సైతం.. ప్రచారంలోకి వస్తున్నాయి. అననేక మంది కరోనాకు ఇది వాడండి.. ఇలా చేయండి.. ఇదైతే.. కరోనా ఫటాఫట్! అంటూ.. సోషల్ మీడియా వేదికలుగా ఊదరగొడుతున్నారు. పాపం.. అమాయక కరోనా బాధితులు.. వీటిని నమ్మి.. అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుని.. ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
ఇక, ఇప్పుడు.. ఒక సంఖ్యాశాస్త్ర(న్యూమెరాలజీ) నిపుణుపుడు.. మరో కొత్త.. వింత వాదాన్ని తెరమీదకి తెచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆనందరావు(Annandd Rao) న్యూమెరాలజిస్ట్.. కరోనా అంతానికి సరికొత్త వాదం ఒకటి తెరమీదికి తెచ్చారు. `కరోనా` స్పెల్లింగ్‌ను మార్చేస్తే.. ఇక, వైరస్ అంతమై పోతుంద ని.. ఆయన ఉవచిస్తున్నారు.
ఆనందరావు చెప్పిన దాని ప్రకారం.. కరోనా(corona) స్పెల్లింగును ‘Caronaa’గా.. covid-19ను ‘COVVIYD-19’గా రాస్తే.. ఇక, వైరస్ దానంతట అదే పోతుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రెండు స్పెల్లింగులను ప్రతి ఇంటి తలుపుపై సహా బహిరంగ ప్రాంతాల్లో రాయాలని, బ్యానరల్లు.. కట్టాలని.. ఇలా చేస్తే.. ఒక్క అనంతపురం జిల్లా నుంచే కాకుండా.. ప్రపంచ నుంచే పారిపోతుందని పేర్కొనడం.. గమనార్హం. ప్రస్తుతం ఈయన అనంతపురం వ్యాప్తంగా కూడా బ్యానర్లు కట్టారు.
అంతేకాదు.. ఈయన దీనికి గ్యారెంటీ కూడా ఇస్తుండడం మరింత విశేషం. ఆనందరావు స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి ప్రజలు దీనిని చూసి నవ్వుకుంటారో.. లేక గుడ్డిగా ఫాలో అవుతారో చూడాలి.