మోడీ రోడ్డు మార్గంలో పంజాబ్ వ‌స్తే మ‌ళ్లీ షాక్ త‌ప్ప‌ద‌ట‌

Update: 2022-02-12 15:30 GMT
కేంద్రం ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా చేప‌ట్టిన నిర‌స‌న‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీటిల్లో తారాస్థాయికి చేరింది ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీని అడ్డుకున్న ప‌రిస్థితి. గ‌త నెల‌లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో రైతుల ఆందోళ‌న‌ల‌తో ప్ర‌ధాని మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవ‌ర్‌పై నిలిచిపోవ‌డం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.

ఆ ఎపిసోడ్‌పై ఇప్ప‌టికే ద‌ర్యాప్తు కొన‌సాగుతుండ‌గా మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితి త‌ప్ప‌ద‌ని పంజాబ్ నుంచి హెచ్చ‌రిక‌లు ఎదుర్కున్నారు ప్ర‌ధాని మోడీ.

పంజాబ్‌లో ఈనెల 20న ఒకే ద‌శ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈనెల 14, 16, 17 తేదీల్లో ప‌లు ర్యాలీల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నుండ‌గా మోడీ టూర్‌ను బ‌హిష్క‌రించాల‌ని రైతులు యోచిస్తున్నారు.

ఈ నెల 14న జ‌లంధ‌ర్‌లో ప్ర‌ధాని మోడీ తొలి ర్యాలీలో పాల్గొన‌నుండ‌గా, 16న ప‌ఠాన్‌కోట్, 17న అబోహ‌ర్‌లో ర్యాలీల‌ను ఉద్దేశించి ఆయ‌న‌ ప్ర‌సంగిస్తారు. అయితే, ఈ టూర్ల విష‌యంలో మోడీ ఊహించిన హెచ్చ‌రిక‌ను ఎదుర్కున్నారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు ఏడాది పాటు రోడ్ల‌పై గ‌డిపిన విష‌యాన్ని పంజాబీలు మ‌రువ‌లేద‌ని కాంగ్రెస్ ఎంపీ ర‌వ్‌నీత్ సింగ్ బిట్టూ వ్యాఖ్యానించారు. నిర‌స‌న‌ల్లో దాదాపు 700 మందికి పైగా రైతులు మ‌ర‌ణించార‌ని గుర్తుచేశారు.

రైతుల నిర‌స‌న‌ల్లో అన్న‌దాత‌లకు ఎదురైన ఇబ్బందుల‌ను వారు ఎలా మ‌రిచిపోతార‌ని బిట్టూ నిల‌దీశారు.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా, ప్ర‌ధాని పంజాబ్‌లో ప‌ర్య‌టించ‌ద‌లుచుకుంటే ఆయ‌న హెలికాఫ్ట‌ర్ లేదా విమానాల్లో ప్ర‌యాణించాల‌ని, రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటే ఆయ‌న‌కు నిర‌స‌న సెగ‌లు త‌ప్ప‌వ‌ని బిట్టూ ప్ర‌క‌టించ‌డం సంచల‌నంగా మారింది.

కాగా, ఇప్ప‌టికే పంజాబ్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని భ‌ద్ర‌తా వైఫ‌ల్యం ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా లోపంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంజాబ్ ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్ట‌గా భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై రిటైర్డ్ న్యాయ‌మూర్తి ఇందు మల్హోత్రా నేతృత్వంలో ద‌ర్యాప్తున‌కు సుప్రీంకోర్టు ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది.

మ‌రోవైపు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా లోపంపై కేంద్ర ప్ర‌భుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా వేర్వేరుగా ద‌ర్యాప్తు క‌మిటీల‌ను ఏర్పాటు చేసి విచార‌ణ‌ను సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

    
    
    

Tags:    

Similar News