లైంగిక వేధింపులు జరిగినా అది రేప్ కిందకు వస్తుంది: హైకోర్టు

Update: 2021-07-18 02:30 GMT
ముంబై హైకోర్టు మరో సంచలన తీర్పును ఇచ్చింది. కేవలం సెక్స్ చేస్తేనే రేప్ జరిగినట్లు కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. ఓ లైంగిక వేధింపుల కేసులో ట్రయల్ కోర్టు దోషిగా తేల్చిన వ్యక్తి హైకోర్టులో అప్పీల్ చేయగా సంచలన తీర్పునిచ్చింది.

లైంగిక వేధింపులు చేసిన వ్యక్తికి బాంబే హైకోర్టు షాకిచ్చింది. అతడిని అప్పీల్ ను తిరస్కరించింది. మహిళకు, తనకు మధ్య సెక్స్ జరగలేదని ఫిర్యాదుదారు కోర్టుకు తెలిపాడు. అయితే ఫోరెన్సిక్ ఆధారాలు రుజువు చేస్తున్నందున అతడు రేప్ చేసినట్లే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇష్టం లేకుండా ప్రైవేటు భాగాలు తాకడం కూడా చట్ట ప్రకారం నేరమని తెలిపింది.

సెక్స్ చేయకపోయినా లైంగిక వేధింపులకు పాల్పడితే అది రేప్ కిందకే వస్తుందని ఇండియన్ పీనల్ కోడ్ అండర్ సెక్షన్ 376 కిందకు వస్తుందని ముంబై హైకోర్టు తెలిపింది.  33ఏళ్ల వ్యక్తి రేప్ చేసిన కేసులో ఈ విధమైన తీర్పును తాజాగా కోర్టు ఇచ్చింది.

2019లో ట్రయల్ కోర్టు ద్వారా ఆ వ్యక్తికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా పడింది. ఆ వ్యక్తి ఒక ఆమెను రేప్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

అయితే తనకు, ఆ మహిళ మధ్య సెక్స్ జరగలేదని బాధితుడు వాడించారు. అయితే బాధితురాలి బట్టలపై దొరికిన మట్టి లైంగిక వేధింపులు జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన మట్టి ఒకటే అని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదించింది. లైంగిక దాడి జరిగిందని ఖచ్చితంగా తెలుస్తోందని నివేదిక తెలిపింది. సెక్స్ జరగకపోయినా జననాంగాల్లో చేతులతో ప్రవేశం చేసినా అది నేరం అని కోర్టు చెప్పింది. ముంబై హైకోర్టు తీర్పుతో సెక్స్ చేయకున్నా రేప్ చేసినట్టేనన్న తీర్పు వచ్చేసినట్టైంది. ఇదో సంచలన తీర్పుగా దేశంలో చర్చనీయాంశమవుతోంది.
Tags:    

Similar News