మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఆర్నెల్ల వరకూ రాష్ట్రపతి పాలనను విధిస్తున్నట్లుగా పేర్కొన్నప్పటికీ.. ఆలోపు రాష్ట్రపతి పాలనను తొలగించే వీల్లేదా? అంటే.. నిక్షేపంగా ఎత్తేయొచ్చంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. రెండు రోజుల వ్యవధి లో శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ పక్షాలు తాము ముగ్గురం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఒప్పందానికి వచ్చామని చెబుతూ.. పార్టీ లెటర్ హెడ్స్ మీద తమ ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించిన లేఖలు ఇస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యం లో రాష్ట్రపతి పాలన కారణం గా పెద్ద నష్టం జరగదనే చెప్పాలి. కాకుంటే.. రాష్ట్రపతి పాలన విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పాలి.తొలుత బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి రెండు రోజులు సమయం ఇచ్చిన గవర్నర్.. శివసేన వరకూ వచ్చేసరికి 24 గంటలు ఇవ్వగా.. ఎన్సీపీ కి సైతం ఒక రోజు గడువు ఇస్తున్నట్లే ఇచ్చి.. 12 గంటలకే గడువు పూర్తి చేయటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. తాను అన్ని పార్టీల కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవకాశం ఇచ్చినా.. ఎవరూ దాన్ని వినియోగించుకో లేదన్న మాటను చెప్పుకునేందుకు వీలుగా ఆయన వ్యవహరించారని చెప్పాలి.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గడువు తీరే వరకూ కామ్ గా ఉన్న బీజేపీ.. ఆ తర్వాత పావుల్ని వేగం గా కదిపింది. చివరకు విసిగిపోయి.. తనతో బంధం తెంచుకున్న శివసేన మళ్లీ తన వద్దకే వచ్చేలా చేసిందన్న మాట వినిపిస్తున్నా.. సేన తాజా పరిణామాల్ని సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి తాజా మహా ఎపిసోడ్ లో అందరి లోనూ బాగా డ్యామేజ్ అయ్యింది శివసేనగా
తొలుత బీజేపీ తో 50-50 కోసం డిమాండ్ చేసినప్పుడు న్యాయ సమ్మతంగా అనిపించినా.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అధికారం కోసం తప్పించి మరింకేమీ సేన నాయకత్వానికి పట్టదన్న భావన కలిగే లా చేశాయన్న మాట వినిపిస్తోంది. తనకున్న పరిమితమైన బలాన్ని అంగీకరించేందుకు రాజకీయ పార్టీలు సుముఖంగా లేవన్న విషయాన్ని సేన ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదంటున్నారు. ఎన్సీపీ తో కలిసే బదులు తమ తోనే రాజీ కి రావటం మంచిదన్న మాట బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. పేరుకు రాష్ట్రపతి పాలనే అయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయం లో రాజకీయ పక్షాలు ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే.. ప్రభుత్వ ఏర్పాటు కష్టమేమీ కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.