దుబాయ్ లో అంబానీ విల్లా కొంటే ఆ మాత్రం రేటు ఉండదా?

Update: 2022-10-20 04:32 GMT
ఖరీదైన ఆస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మిగిలిన వారికి కంటే మహా జోరుగా ఉంటారు. తాజాగా దుబాయ్ లో ఆయన కొన్న విల్లా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్ దేశంలో అత్యంత ఖరీదైన డీల్ గా ఈ కొనుగోలు రికార్డును క్రియేట్ చేసింది. ఆసియాలో రెండో అతి పెద్ద ధనవంతుడిగా పేరున్న ముకేశ్ అంబానీ తాజాగా రూ.1350 కోట్లు చెల్లించి దుబాయ్ లోని పామ్ జుమైరా దీవిలోని ఒక లగ్జరీ విల్లాను సొంతం చేసుకున్నారు.

ఈ బీచ్ సైడ్ విల్లాను కువైట్ కు చెందిన అల్హయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ మహమ్మద్ అల్షయా నుంచి కొన్నట్లుగా చెబుతున్నారు. ఇతని కుటుంబాన్ని కువైట్ దిగ్గజంగా అభివర్ణిస్తుంటారు. అల్ షాయాకు స్థానికంగా స్టార్ బక్స్.. హెచ్ అండ్ ఎం.. విక్టోరియాస్ సీక్రెట్ వంటి రిటైల్ బ్రాండ్ల ప్రాంఛైజీలు ఉన్నాయి.

గతంలో అత్యంత ఖరీదైన విల్లాను దుబాయ్ లో కొన్న అంబానీ.. తాజా కొనుగోలుతో ఇది రెండో విల్లా అయ్యింది. గతంలో కొన్న విల్లా కూడా పామ్ జుమైరా దీవిలోనే ఉండం గమనార్హం. ఈ ఏడాదిలో మొదటి విల్లాను తన చిన్న కొడుకు అనంత్ అంబానీ కోసం 10 బెడ్రూమ్ లున్న లగ్జరీ విల్లాను కొనుగో దాదాపు రూ.600 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా.

తాజాగా మాత్రం అంతకు రెట్టింపు మొత్తంతో కొనుగోలు చేయటం గమనార్హం. పామ్ జుమైరా దీవి సహజ సిద్ధమైనది కాదు. దాన్ని ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. సముద్రతీరంలో ఖర్జూర చెట్టు ఆకారంతో ఏర్పాటు చేసిన కృత్రిమ దీవి ఇది. గతంలో రూ.592 కోట్లకు స్టోక్ పార్క్ క్లబ్ ను దక్కించుకున్న అంబానీ ఇప్పుడేు న్యూయార్క్ లోని ఒక లగ్జరీ ప్రాపర్టీని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ డీల్ కు సంబంధించిన వివరాల్ని రిలయన్స్ కానీ.. అల్ షాయా వర్గాల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News