మీరు త్వరగా ముసలోళ్లు కావద్దనుకుంటే.. ఈ ఒక్కటి పాటించండి..!

Update: 2022-12-20 23:30 GMT
ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి 'వాడు ముసలోడు అవ్వకూడదే' అని తన ఫ్రెండ్స్ తో చెబుతోంది. ఈ డైలాగ్ వింతగా అనిపిస్తున్నా.. కొన్ని అలవాట్లకు మనం దూరంగా ఉంటే వృద్ధాప్య ఛాయలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆ అలవాటు మాత్రం ఇప్పటికే 'కల్చర్' పేరుతో చిన్న పిల్లలకు సైతం పాకిపోయింది.

ఇలాంటి తరుణంలో ఈ అలవాటుకు ఎంతమంది దూరంగా ఉండటారనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇంతకీ ఆ అలవాటు ఏంటనే కదా.. మీ డౌట్.. ఇప్పటికే 'కల్చర్' అనగానే మీకు సగం అర్ధమైపోయి ఉంటుంది. ఇక ఊరించడం ఆపి అసలు విషయంలోకి వెళితే.. !

మద్యానికి ఎంత దూరంగా ఉంటే వృద్ధాప్యానికి అంత దూరంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధాప్యం రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మద్యం అలవాటు వల్ల త్వరగా ముసలితనం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వయస్సు మీద పడే కొద్ది శరీరానికి దాహం వేయడం తగ్గుతుంది.

తద్వారా ఒంట్లో నీటి శాతం తగ్గుతూ పోతుంది. అలాగే మద్యం అలవాటు శరీరంలో నీటిని బయటకు వెళ్లేలా చేస్తుంది. దీంతో శరీరంలో నిస్సత్తువ చేసి ముఖంలో కళ తగ్గుతుంది. వయస్సు మీద పడే కొద్దీ చర్మం పల్చగా.. పొడిబారటం జరుగుతుంది. చర్మం కింద కొవ్వు తగ్గి ముడతలు దారితీసింది.

ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. అయితే మద్యం మూలంగా ఒంట్లో నీటి శాతం తగ్గి.. చర్మం త్వరగా ముడతలు పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో కీలక అవయవాలు అయిన కాలేయం.. మెదడు పనితీరు సామర్థ్యంపై మద్యం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

అలాగే క్షయ.. న్యూమోనియా వంటి ప్రాణాంతక సమస్యలతో శరీరం పోరాడే తీరుపై మద్యం ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మద్యం మత్తు కారణంగా తలనొప్పి వంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మద్యం అలవాటు కారణంగా ఎముకలు తేలికగా విరిగే అవకాశం ఉంటుందని తద్వారా శరీరంపై పట్టు తప్పుతుందని చెబుతున్నారు.

మద్యం అలవాటు మొదట్లో మత్తుగా అనిపించినా తర్వాత నిద్రకు దూరంగా చేస్తుందని పరిశోధనలు వెల్లడైంది. ఈ లక్షణాలన్నీ కూడా మనిషి త్వరగా వృద్ధాప్యం బారిన పడటానికి దారి తీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఒక్క అలవాటు ఎంత దూరంగా ఉంటే ముసలి తనానికి కూడా అంత దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఛాయిస్ మీదే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News