బ్రిటన్ లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడా మహోత్సవంలో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. అంచనాలకు మించి వస్తున్న పతకాలు క్రీడాభిమానుల్ని సంతోషానికి గురి చేస్తున్నాయి. మిగిలిన ప్రధానమంత్రులకు భిన్నంగా నరేంద్ర మోడీ క్రీడాకారుల విషయంలో కాస్తంత ఎక్కువ కేర్ తీసుకోవటమే కాదు.. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని కూడా ఆయన సేకరిస్తుంటారని చెప్పొచ్చు.
దీంతో.. ఆయన నోటి నుంచి వచ్చే కొన్ని విషయాలు దేశ ప్రజల్ని కట్టి పడేయటమే కాదు..ఆయన మీద అభిమానాన్ని మరింత పెంచేలా చేస్తాయి. తాజాగా అలాంటి వ్యాఖ్య ఒకటి ప్రధాని నోటి నుంచి వచ్చింది.
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పురుషుల 73 కేజీల విభాగంలో 20 ఏళ్ల అచింత షూలి బంగారు పతకాన్ని సాధించాడు. దీంతో.. భారత్ కు లభించిన బంగారు పతకాల సంఖ్య మూడుకు చేరుకుంది. దీంతో.. అచింత మీద పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రయత్నంలో ఫెయిల్ అయినా.. దానికి సంబంధించిన ఒత్తిడిని అధిగమించి మరీ సత్తా చాటిన వైనాన్ని అభినందిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించగా.. మోడీ మరింతలా పొగిడేశారు. కామన్ వెల్త్ పోటీల్లో అచింత స్వర్ణాన్ని సాధించటం తనకు హ్యాపీగా ఉందని ప్రధాని ట్వీట్ చేశారు.
పతకాన్ని సాధించటం కోసం అచింత చాలా కష్టపడ్డాడని.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతను చాలా శాంతంగా ఉంటాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ మధ్యనే జరిగిన ఒక ఉదంతాన్ని ప్రస్తావించారు. కామన్ వెల్త్ పోటీలకు వెళ్లే క్రీడా సభ్యులతో ప్రధాని మోడీ భేటీ అయి వారందరితో మాట్లాడారు. ఆ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘తనకు సహాయ సహకారాలు అందించటంలో తన తల్లి.. తన సోదరుడు ఎంతో సాయం చేశారని అచింత నాతో చెప్పాడు’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ప్రధాని షేర్ చేశారు.
అందులో అచింతతో మాట్లాడుతూ.. సినిమాలు చూస్తావా? అని ప్రధాని మోడీ అడగ్గా.. తనకు టైం దొరక్కట్లేదని పేర్కొన్నారు. బెంగాల్ కు చెందిన అచింత సాధించిన స్వర్ణపతకం నేపథ్యంలో మోడీ అతన్ని అభినందిస్తూ.. ‘అతను పతకం సాధించాడు కాబట్టి సినిమా చూడటానికి సమయం దొరుకుతుందని ఆశిస్తున్నా. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలి’ అని పేరకొన్నారు. ఇక.. తన విజయంపై అచింత మాట్లాడారు. తనకు విజయం అంత సులువుగా రాలేదని.. రెండో ప్రయత్నంలో సరైన వెయిట్ ను తాను ఎత్తటంలో ఫెయిల్ అయ్యానని చెప్పారు.
అయితే.. తనను తన కోచ్ ఎంతో ప్రోత్సహించారని.. దీంతో తన శాయశక్తులా ప్రయత్నించి సాధించినట్లు చెప్పారు. తాను సాధించిన పతకం వెనుక తన తల్లి.. సోదరుడి కష్టం ఎంతో ఉందన్నారు. అచింత సాధించిన స్వర్ణంతో భారత్ కు మొత్తం మూడు స్వర్ణాలు.. రెండు రజతాలు.. ఒక కాంస్య పతకాల్ని తన ఖాతాలో వేసుకుంది.
Full View Full View Full View