తమ ప్రభుత్వం చేసే పనుల గురించి గొప్పగా చెప్పుకోవటం తప్పేం కాదు. వాస్తవ కోణంలో చూస్తే.. అంతిమ నిర్ణయం అధినేత చేతుల్లో ఉన్నా.. వాటికి సంబంధించిన పనులన్నీ మాత్రం అధికారుల చేతుల్లోనే ఉంటాయి. ఆ మాటకు వస్తే పాలకుడి నోటి నుంచి వచ్చే మాటలకు ముందు.. కీలక అధికారులు.. చుట్టూ ఉన్న సలహాదారుల్లో అత్యంత ముఖ్యలు ఇచ్చే బ్రీఫింగ్ ను తమదైన శైలిలో ఇంప్రూవ్ చేసి అధినేతలు చెప్పుకోవటం మామూలే. మిగిలిన వారితో పోలిస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది. అదేమంటే.. తాము చేసే పనుల గురించి.. పథకాల గురించి వివరంగా చెప్పుకుంటూ ఎంత గొప్పగా చేస్తున్నామో చూశారా? అన్న సందేశాన్ని ఇచ్చేలా సీఎం జగన్ ప్రయత్నిస్తుంటారు.
ఇలాంటి వేళలోనే లేనిపోని కష్టాల్ని 'కొని' తెచ్చుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రికి మించినోళ్లు లేరంటున్నారు. విద్యార్థులకు బైజూస్ కంటెంట్ ఇవ్వటం.. దానికి అవసరమైన ట్యాబ్ లను విద్యార్థులకు అందజేసే కార్యక్రమాన్ని భారీగా చేపట్టిన వైనం గురించి జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకోవటం తెలిసిందే. సాపేక్షంగా చూస్తే.. విద్యార్థులకు ట్యాబ్ లు అందజేయటం అనేది మంచిదే. కాకుంటే.. దానికి పెట్టే ఖర్చుతో అంతకు మించిన మెరుగైన పనులు ఎన్నింటినో చేసే అవకాశం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్తులకు శాంసంగ్ ట్యాబ్ లను రూ.688 కోట్లు ఖర్చు చేసి అందజేస్తున్నట్లుగా సీఎం జగన్ వెల్లడించారు. మొత్తం 5.18 లక్షలకు పైచిలుకు ట్యాబ్ లు అందజేసినట్లుగా పేర్కొన్నారు. ఎన్ని ట్యాబ్ లు పంచామన్న విషయాన్ని చెబితే సరిపోయేది. అయితే.. దానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడిస్తూ.. ఒక్కో ట్యాబ్ కోసం రూ.13,263 ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు.
జగన్ నోటి నుంచి ఈ మాట వచ్చినంతనే పలువురు నెటిజన్లు..
ఆయన్ను విమర్శనాత్మకంగా వేలెత్తి చూపించే అవకాశం కోసం ఆన్ లైన్ మీద పడ్డారు. తాజాగా వారు తేల్చిన విషయం ఏమంటే.. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 ధర రూ.11,999 మాత్రమేనని.. ఆ ధరను అమెజాన్ చెబుతుందన్నది సారాంశం. ఆన్ లైన్ లో చూపిస్తున్నది 12వేలు అని.. అదే బల్క్ గా కొనాలే కానీ మరింత తక్కువ ధరకు లభిస్తుందని చెబుతూ.. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు అంత తినేశావ్.. ఇంత తినేశావ్ అంటూ పంచ్ లు వేయటం మొదలైంది.
ఇప్పుడు చూపిస్తున్న ఫోటోలో సదరు ట్యాబ్ రూ.9వేలకు వస్తుందని పేర్కొన్నారు. ఎంత బల్క్ గా కొంటే మాత్రం ఒక్కో ట్యాబ్ మీద రూ.3వేలు తగ్గిస్తారా? అన్నది అనుమానమే. అలా అని అసలు తప్పు జరగలేదని చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూస్తే.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అధినేత ద్వారా ప్రజలకు సందేశాల్ని ఇచ్చే వేళ.. ఇప్పుడున్న టెక్నాలజీ నేపథ్యంలో.. జగన్ టీం మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాల్టి రోజున ట్యాబ్ లెక్కల మీద సోషల్ మీడియాలో జగన్ సర్కారు మీద జరిగే డ్యామేజ్ మొత్తం ఆయన ఏరికోరి ఉంచుకున్న ఆయన టీం కారణమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి వాటి విషయాల్లో జగన్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.