కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరించింది. భారత్ లో దీని ప్రభావం రోజురోజుకి పెంచుకుంటూ పోతుండటంతో ఈ కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా ముంబయి - పుణే - ఇండోర్ - జయపుర, -కోల్ కతా - పశ్చిమ్ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ అత్యంత తీవ్రంగా ఉందని సోమవారం కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిచండం తో కరోనా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు తీవ్రంగా ఉందని హెచ్చరించింది.
ఈ ప్రాంతాల్లో ఆరు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీఎటీ) ను కేంద్రం ఏర్పాటుచేసి.. ఎప్పటి కప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ మధ్యప్రదేశ్ - మహారాష్ట్ర, -రాజస్థాన్ - పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాలకు అవసరమైన సూచనలు ఇస్తుంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం లాక్ డౌన్ అమలుపై ఈ ఐఎంసీటీలు దృష్టి సారించనున్నాయి. నిత్యావసరాల సరఫరా - సామాజిక దూరం - ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధత - ఆరోగ్య నిపుణుల భద్రత - నిరుపేదలు - కూలీల సహాయ శిబిరాల పరిస్థితుల గురించి నివేదిక రూపొందించిన కేంద్రానికి అందజేయనున్నాయి
అలాగే పలు రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందజేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులు - సామాజిక దూరం పాటించకపోవడం, -పట్టణాల్లో భారీగా వాహనాల రోడ్లపైకి రావడం లాంటి ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇది ఇటువంటి సమయంలో ఏ మాత్రం సమంజసం కాదు అని ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే దేశంలో ప్రస్తుతం 17,300పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 543మంది కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోయారు.