రూ.2ల‌క్ష‌ల‌కు మించి తీసుకుంటున్నారా?

Update: 2017-06-03 05:57 GMT
ప‌రిస్థితులు మారాయి. గ‌తంలో మాదిరి న‌గ‌దు లావాదేవీలు జ‌రిపే ఛాన్స్ లేదు. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌గ‌దు లావాదేవీల‌పై స‌రికొత్త ఆంక్ష‌లు రావ‌టం తెలిసిందే. ఇదే విష‌యాన్ని కేంద్ర వార్షిక బ‌డ్జెట్‌ లోనూ స్ప‌ష్టం చేశారు. రూ.3 ల‌క్ష‌లు.. అంత‌కు మించిన న‌గ‌దు లావాదేవీలపై నిషేధం ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ రూల్ ను మార్చారు.

రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.2 ల‌క్ష‌ల‌కు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై రూ.2ల‌క్ష‌లు.. అంత‌కు మించిన న‌గ‌దును స్వీక‌రిస్తే.. ఆ పై ఎంత మొత్తాన్ని తీసుకుంటే అంత మొత్తాన్ని ఫైన్ రూపంలో అధికారులు వ‌సూలు చేయ‌నున్నారు. మ‌రింత స్ప‌ష్టంగా చెప్పాలంటే.. ఏదైనా ఒక లావాదేవీ లేదంటే ఒక‌టికి మించిన లావాదేవాల్లో రూ.2ల‌క్ష‌ల రూపాయిల కంటే ఎక్కువ న‌గ‌దును ఒకేసారి తీసుకోవ‌టం నిషేధం. అలా తీసుకున్న వారిపై భారీ జ‌రిమానా విధిస్తారు. మ‌రి.. లావాదేవీలు ఎలా చేయాల‌న్న క్వ‌శ్చ‌న్ వ‌స్తుందా? అక్క‌డికే వ‌స్తున్నాం. రూ.2ల‌క్ష‌ల‌కు మించిన లావాదేవీలు ఏవైనా స‌రే.. న‌గ‌దు రూపంలో కాకుండా మిగిలిన మార్గాల్లో చెల్లింపులు జ‌ర‌పాల్సి ఉంటుంది.

న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టేందుకు వీలుగా తాజా రూల్ ను తీసుకొచ్చేశారు. సో.. రూ.2ల‌క్ష‌లు.. అంత‌కు మించిన మొత్తాన్ని కానీ న‌గ‌దు రూపంలో చెల్లిస్తుంటే.. వెంట‌నే దానికి చెక్ చెప్పండి. లేదంటే అడ్డంగా బుక్ కావ‌ట‌మే కాదు.. భారీ ఎత్తున జ‌రిమానా క‌ట్టాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకండి.

భారీ న‌గ‌దు లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారాన్ని త‌మ‌కు తెలియ‌జేయాలంటూ ప్ర‌భుత్వం ఒక మొయిల్ ఐడీని కూడా ఇచ్చేసింది. రూ.2లక్ష‌ల‌కు మించిన భారీ మొత్తాల లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారాన్ని త‌మ‌కు ఇవ్వాలంటూ  blackmoneyinfo@incometax.gov.in ప్ర‌జ‌లు కోరింది. గుట్టుగా మీ ప‌ని మీరు చేస్తున్నా..మీ చుట్టూ ఉన్న వారి కంటి నుంచి త‌ప్పించుకోలేర‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News