ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నట్లుగా అస్సలు జరగటం లేదు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల షాకుల నుంచి దాదాపుగా ఎదురుదెబ్బలే తింటున్న వైనం రోజురోజుకి పెరుగుతోంది. ఆయనేం మొదలెట్టినా.. చిరిగి చాటంత కావటమే కాదు.. ఆయన అనుకున్నట్లుగా జరగని పరిస్థితి.
కొత్త అసెంబ్లీ భవనాన్ని ఏర్పాటు చేయాలని.. అందుకు ఎర్రమంజిల్ దగ్గర తన మనసుకు నచ్చినట్లుగా కట్టించుకోవాలనుకోవటం.. అందుకు కోర్టు కేసులు.. ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేసే అంశంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఓవైపు కోర్టు కేసులు ఉన్నా.. తాను అనుకున్నట్లుగా కొత్త అసెంబ్లీ.. కొత్త సచివాలయానికి నిర్మించి తీరాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఈసారి పంద్రాగస్టు నాడు పబ్లిక్ గార్డెన్ లో జెండా ఎగురవేయాలని అనుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకు తగ్గట్లే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటి తరహాలో గొల్కొండలో కాకుండా వెన్యూ ఛేంజ్ చేశారు. పబ్లిక్ గార్డెన్ వద్ద త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేపట్టాలని అనుకున్నారు. అయితే.. ఆయన అనుకున్నట్లు జరగట్లేదు. సాంకేతిక కారణాలతో పబ్లిక్ గార్డెన్ లో జెండా ఎగురవేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పంద్రాగస్టు వేళ గొల్కొండలో జెండా ఎగురవేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద తెలంగాణకు పెద్ద సారైన కేసీఆర్.. తాను నచ్చిన చోట.. మెచ్చిన తీరులో జెండా ఎగురవేయలేకపోవటం ఏమిటో? కాలమహిమ అంటే ఇదేనేమో?