ఇండియాలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ కూడా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజా ప్రభుత్వ కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం ..దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి భారిన పడి చికిత్స తీసుకుంటున్నవారి సంఖ్య 6 లక్షల దిగువకు చేరగా.. మొత్తం కేసుల సంఖ్య 81 లక్షలకు చేరువలో ఉంది. గురువారం 11,64,648 నమూనాలను పరీక్షించగా 48,648 మందికి పాజిటివ్ గా తేలింది. దీనితో దేశంలో మొత్తం కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య 80,88,851గా నమోదైంది.
అలాగే , గడిచిన 24 గంటల్లో 563 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,21,090కి చేరింది. అలాగే, దేశ వ్యాప్తంగా 57,386 మంది డిశ్ఛార్జి కాగా ఇప్పటి వరకూ 73,73,375 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 5,94,386 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు రికవరీ రేటు పెరుగుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
దాదాపు 90.99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 7.51 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.50 శాతానికి తగ్గిందని బులిటెన్ లో పేర్కొంది. దేశవ్యాప్తంగా అక్టోబర్ 29 నాటికి 10,77,28,088 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. ఇందులో నిన్న ఒకేరోజు 11,64,648 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.