టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లోకి భారత్ ఎంట్రీ !

Update: 2021-03-06 16:42 GMT
క్రికెట్ టీమ్ ఇండియా .. ప్రపంచంలోనే మేటి జట్లలో ఒకటి. భారత్ ను ఢీ కొట్టాలంటే ఏ దేశం జట్టైనా కూడా చమటోడ్చాల్సిందే. అయినా కూడా ఇండియా పై విజయం సాధించడం కష్టమే. గత కొన్ని రోజులుగా ముఖ్యంగా టెస్టుల్లో టీం ఇండియా సూపర్ విజయాలతో దూసుకుపోతుంది. ఈ మద్యే ఆస్ట్రేలియా లో వారిని చిత్తూ చిత్తుగా ఓడించిన తర్వాత , ఇంగ్లాండ్ తో హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగింది. అయితే, తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళ ధాటికి టీమిండియా చేతులెత్తేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ ఓడిపోవడం అంటే ఏ జట్టుకైనా పెద్ద ఎదురుదెబ్బే. కానీ, ఆ దెబ్బతో టీమిండియా రెట్టించిన కోపంతో  ఎగసిపడింది. ఇంగ్లాండ్ టీం కు చుక్కలు చూపించింది. వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్ లు తిరుగులేని ఆధిక్యంతో గెలిచి సిరీస్ సాధించింది. ఈ సిరీస్ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్ లో అగ్రస్థానికి ఎగబాకింది. ద్వితీయ స్థానంలో న్యూజిలాండ్ కొనసాగుతుంది. ఇప్పటికే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ కైవసం చేసుకున్న భారత్ జూన్ 18 నుంచి లాడ్ప్ వేదికగా న్యూజిలాండ్ తో తలపడనుంది.

మరోవైపు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఎంఆర్ఎఫ్ వరల్డ్ వైడ్ ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్ లోనూ నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఇక తాజాగా ముగిసిన నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్‌ తో జరిగిన ఆఖరి మ్యాచ్‌ లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మరో రెండు రోజుల ఆట మిగిలివుండగానే ఇన్నింగ్స్ 25 పరుగులతో కోహ్లీ సేన ఘన విజయం నమోదు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్ 3-1 తేడాతోకైవసం చేసుకుంది. మూడో టెస్టును రెండు రోజుల్లో ముగించిన భారత్, ఆఖరి టెస్టును మూచ్చటగా మూడు రోజుల్లో ముగించి సత్తాచాటింది.
Tags:    

Similar News