నైరుతి రిటర్న్స్.. ఇక వానలు పడవట..

Update: 2018-09-24 07:04 GMT
నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయి. జూన్ లోనే కేరళ తీరాన్ని తాకి దేశవ్యాప్తంగా హిమాలయాల వరకూ విస్తరించిన వానలు తాజాగా వెనక్కి మళ్లాయి. ఈ నైరుతి తిరుగోమనం వేళ కూడా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. వాయువ్య భారత్ నుంచి శనివారం రుతు పవనాలు తిరుగుముఖం వెళ్లడం ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమణ సాధారణంగా సెప్టెంబర్ తొలివారం నుంచే మొదలవుతుంది. కానీ ఈ ఏడాది నాలుగు వారాలు ఆలస్యంగా ప్రారంభమైందని వాతావరణ శాఖ తెలిపింది.

పశ్చిమ రాజస్థాన్ వాతావరణంలో గురువారం నుంచి మార్పు రావడం ప్రారంభమైందని వాతావరణ విభాగం తెలిపింది. నైరుతి రుతుపవనాల వల్లే దేశంలో 70శాతం వర్షాలు పడుతాయి. సుమారు 26.3 కోట్ల రైతులు వీటిపైనే ఆధారపడే పంటలు పండిస్తారు. అయితే నైరుతి వల్ల ఇప్పటివరకూ దేశంలో ఆశించిన దాని కన్నా 10శాతం తక్కువ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. కాగా నైరుతి రుతుపవనాలు నిష్ర్కమణ తర్వాత ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఇవి తమిళనాడు, శ్రీలంక లకు మాత్రమే భారీవర్షాలను కురిపిస్తాయి. దీంతో ఇక దేశంలో వానలకు సెలవిచ్చినట్టేనని అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News