జమ్మూలో భారత జవాన్లపై ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పాకిస్థాన్ దేశంపై భారత ప్రజలు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై తగిన చర్యలు తీసుకుంటామని భారత్ ఇదివరకే హెచ్చరించింది. ఆదేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను ఒక్కొక్కటిగా తెంచేసుకుంటోంది.ఇందులో భాగంగా భారత్ కు చెందిన ప్రముఖ కంపెనీలు సైతం పాకిస్థాన్ తో ఎలాంటి సంబంధాలు ఉండకుండా తెగతెంపులు చేసుకుంటున్నాయి. తాజాగా పాకిస్థాన్ కు భారత్ టమాటాల ఎగుమతిని నిలిపివేసింది. దీంతో ఆ దేశంలో టమాటాల ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి. కిలోకు రూ.200 చొప్పున విక్రయిస్తుండడంతో పాక్ ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు.
పాక్ కు టమాటా ఎగుమతిని నిషేధించడంతో సరిహద్దుల్లో టమాటాలను తీసుకెళ్లే లారీలు భారీగా నిలిచిపోయాయి. పాక్ కు టామాటా సరఫరాను భారత్ నిలిపివేయడంపై పాకిస్తాన్ కు చెందిన ఓ జర్నలిస్టు భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. టమాటా ఎగుమతి చేయని భారత్ పై అణుబాంబులు వేయాలంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. టమాటాలను మోదీ ముఖాలపై విసురుతామన్నారు. దేశవ్యాప్తంగా టమాటా సంక్షోభం నెలకొనడంతో మిగతా పాక్ మీడియా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అయితే పాక్ జర్నలిస్టు వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక్క టమాటాల ఎగుమతిని ఆపివేస్తేనే దేశం విలవిలలాడిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇక భారత్ అన్ని వైపులా ఆహార వస్తువులపై నిషేధం ప్రకటిస్తే పాక్ పూర్తిగా బతకలేదని పోస్టులు పెడుతున్నారు. కాగా ఇదివరకే పాక్ తో 'అత్యంత సన్నిహిత దేశం' అనే హోదాను భారత్ తెంచేసుకుంది. అలాగే పాక్ వస్తువులు దేశంలోకి రాకుండా 200 శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది.
అటు ప్రముఖ రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ సైతం పాక్ తో మీడియా సంబంధాలను తెంచుకున్నాడు.. ఈ నిర్ణయం ఎప్పుడో అమల్లోకి వచ్చింది. దీంతో పాక్ క్రికెట్ ప్రసారాలు రిలయన్స్ తో సంబంధం లేకుండా పోయాయి.