కరోనా అప్డేట్ : భారత్ లో 12 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు !
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. దీనితో దేశంలోమొత్తంగా ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటి .. 12 లక్షలకి దగ్గర్లో ఉంది. 6 లక్షల కేసులు జులై నెలలోని 20 రోజుల్లో నమోదయ్యాయి. భారత్‌లో వైరస్ వ్యాప్తి మొదలైనప్పటితో పోల్చితే జులై నెల లో మరణాలు కూడా భారీగా చోటుచేసుకున్నాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 37,724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,92,915కి చేరింది. ఇక వీటిలో ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని 7,53,050 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. అలాగే... గత 24 గంటల్లో 648 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 28732కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 2.4 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువే.
అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా ప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇండియా టాప్ 3లో ఉండగా... రోజువారీ కేసుల్లో కూడా టాప్ 3లోనే ఉంది. మొత్తం మరణాల్లో భారత్, నెల రోజులుగా టాప్ 8లో ఉండేది కాస్తా ఇప్పుడు స్పెయిన్‌ను వెనక్కి నెట్టి, టాప్ 7లోకి వెళ్లింది. రోజువారీ మరణాల్లో భారత్ ఇప్పుడు టాప్ 3లో ఉంది. ఇండియాలో ప్రధానంగా మహారాష్ట్ర , తమిళనాడు , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , ఉత్తరప్రదేశ్ , గుజరాత్ ఇలా ఆరు రాష్ట్రాల్లో 50వేలకు పైగా కేసులున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కేసులు బాగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఏపీ... టాప్ 4లో చేరింది. కేంద్రం ఈ రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ప్రధాని స్వయంగా ఈ రాష్ట్రాల్ని పర్యవేక్షిస్తున్నారు.