బంగ్లాదేశ్ కు ఇండియా వ్యాక్సిన్

Update: 2020-11-27 23:30 GMT
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా ఆవహించింది. వైరస్ కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో వ్యాక్సిన్ పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. మూడు నాలుగు సంస్థలు 3వ దశ క్లినికల్ ట్రయల్స్ దశలోకి వస్తున్నాయి.

దేశంలో మూడు ఫార్మా సంస్థలు కరోనా వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ తో పాటుగా సీరం ఇన్స్టిట్యూట్ కూడా కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. బ్రిటన్ కి చెందిన ఆక్స్ ఫర్డ్, అస్త్రజెనకా సంస్థలు కలిసి సంయుక్తంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్నాయి. దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉన్నది. వ్యాక్సిన్ కి అనుమతి వచ్చిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది.

ఇక వ్యాక్సిన్ తయారీ ఊపందుకోవడంతో ఇండియాతో పాటుగా వివిధ దేశాలకు కూడా సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ను సరఫరా చేయబోతున్నది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ కి చెందిన బెక్సింకో ఫార్మా మధ్య డీల్ కుదిరింది. వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించిన తరువాత సీరం ఇన్స్టిట్యూట్ సంస్థ మూడు కోట్ల వ్యాక్సిన్ డోసులను ఆ దేశానికీ అందించనున్నది. వ్యాక్సిన్ డీల్ తో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని బంగ్లాదేశ్ లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి ట్వీట్ చేశారు.

భారత్ ఉత్పత్తి చేయడంతోపాటు పక్క దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ కు కూడా అందించేందుకు నడుం బిగించింది.





Tags:    

Similar News