ఫ్యూచర్ లో పెట్రోల్ దిగుమతి అక్కర్లేదట

Update: 2016-09-07 12:05 GMT
అక్కడెక్కడో ఉన్న గల్ఫ్ లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే దానికి భారత్ మూల్యం చెల్లించిన పరిస్థితి. అయితే.. ఇదంతా గతమని చెబుతున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. గతంలో విదేశాల నుంచి ముడిచమురు రాకున్నా.. డిమాండ్ కాస్త పెరిగినా ఉలిక్కిపడిపోయే పరిస్థితి. ముడిచమురు అవసరాలు ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ప్రభుత్వాలకు చెమటలు పట్టేవి. అయితే.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు నితిన్ గడ్కరీ. ఇప్పటికైతే ఇలా ఉంది కానీ.. రానున్న రోజుల్లో పరిస్థితుల్లో మరింత మార్పు రానుందని ఆయన చెబుతున్న మాటలు వింటుంటే.. నిజమా? అన్న భావన కలగక మానదు.

ఫ్యూచర్ లో పెట్రోల్ దిగుమతి అవసరం లేదని ఆయన చెబుతున్న మాటలు ఆసక్తిని రేకెత్తించటమే కాదు.. కొత్త ఆశల్ని పుట్టించేలా చేస్తుంది. వాస్తవానికి ఇప్పటికే అలాంటి పరిస్థితి భారత్ లో ప్రారంభమైందని చెబుతున్నారు. అదెలానంటే.. గతంలో రూ.7.54 లక్షల కోట్ల మేర ముడిచమురు దిగుమతి చేసుకుంటే తప్పించి పూటగడవని పరిస్థితి ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది.

వర్తమానాన్ని గతంతో పోల్చి చూసినప్పుడు ముడిచమురు దిగుమతుల విషయంలో భారత్ ఎంత తక్కువగా ఆధారపడుతుందన్న విషయాన్ని చూస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఎందుకంటే.. గతంలో ఏటా రూ.7.54లక్షల కోట్ల మేర ముడిచమురు దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి తాజాగా రూ.4.5లక్షల కోట్ల ముడిచమురును మాత్రమే దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి.

రోజురోజుకీ ముడిచమురు వినియోగం పెరుగుతున్నా.. ప్రత్యామ్నాయ ఇంధనాల్ని సొంతంగా అభివృద్ధి చేసుకోవటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ ఇందన వనరుల అభివృద్ధి మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ముడిచమురు దిగుమతి మీద ఆధారపడాల్సిన అవసరం భారత్ కు పెద్దగా ఉండదని గడ్కరీ చెబుతున్న మాటలు కొత్త ఆశలురేపటం ఖాయంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News