అమెరికాలో మరో దారుణం జరిగింది. కాలిఫోర్నియాలో విధుల్లో ఉన్న భారత సంతతి పోలీస్ అధికారిని గుర్తు తెలియని సాయుధ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. కర్పోరల్ రోనిల్ సింగ్ (33) అనే భారత సంతతి అధికారి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా క్రిస్మస్ పండుగ రాత్రి ఫుల్లుగా మద్యం తాగి వాహనం పై వచ్చిన దుండగుడు దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ పోలీస్ రోనిల్ సింగ్ ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కాల్పులు జరపగానే నిందుతుడు వాహనం పై పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడు ఊహాచిత్రం, వాహనం వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లకు మీడియాకు పంపించారు. వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
రోనిల్ సింగ్ మరణించడానికి ముందే క్రిస్మస్ వేడుకల్లో భార్య అనామిక, ఐదు నెలల కుమారుడితో పండుగను ఘనంగా జరుపుకున్నాడు. వారితో కలిసి ఫొటోలు దిగాడని స్థానికులు తెలిపారు. ఇంతలోనే దుండగుడి కాల్పుల్లో మరణించడం కలిచివేసిందని స్థానికులు చెప్పుకొచ్చారు. పోలీసు మృతికి పోలీసు అధికారులు సంతాపం తెలిపారు. కాలిఫోర్నియా గవర్నర్ బ్రౌన్ మృతుడి భార్య, కుమారుడు, తోటి ఉద్యోగులకు సానుభూతి తెలిపారు.