ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ వాతావరణం సంగతేమో గానీ అది భారతీయుల చావుకొచ్చి పడింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి రెడీ అయిపోయిన విషయం యావత్ ప్రపంచాన్ని కలవర పెట్టేస్తోంది. ఉక్రెయిన్ పై దాడి లేదా యుద్ధం చేయటానికి వీలుగా రష్యా సైన్యాలు మూడు వైపులా మోహరించేశాయి. దక్షిణి ఉక్రెయిన్, బెలారస్, క్రిమియా సరిహద్దుల్లో రష్యా భారీ ఎత్తున యుద్ధ ట్యాంకర్లను, క్షిపణులతో పాటు ఇతర ఆయుధాలను మోహరించి పెట్టుకుంది.
ఫిబ్రవరి 15వ తేదీ అంటే ఈరోజే ఉక్రెయిన్ పై ఎటాక్ చేయటానికి రష్యా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నదనే వార్తలు ప్రపంచంలో వణుకు పుట్టిస్తోంది. రెండు దేశాల మధ్య సైన్యంలోనే కాదు మామూలు జనాల్లో కూడా టెన్షన్ నిముష నిముషానికి పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే మనదేశం పౌరుల విషయమై జనాల్లో టెన్షన్ ఎక్కువైపోతోంది. అనధికారిక లెక్కల ప్రకారం వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు సుమారు 20 వేల మంది ఉక్రెయిన్లో చదువుకుంటున్నారు.
ఉక్రెయిన్లో మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సుల్లో చదవటానికి వివిధ ఏజెన్సీల ద్వారా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళ, పంజాబ్, రాజస్ధాన్ రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల వాళ్ళు సుమారుగా 4 వేలదాక ఉండచ్చని అంచనా. ఇపుడు 20 వేలమంది తల్లి, దండ్రులు ఉక్రెయిన్లోని భారతీయ రాయబార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. అయితే అక్కడి నుండి పెద్దగా రెస్పాన్స్ ఉండటం లేదు.
చదువుకోవటానికి విద్యార్ధులు కాకుండా ఇతరత్రా అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తుల్లో ఇంకెంతమంది ఉన్నారనే విషయంలో క్లారిటి లేదు. ఉక్రెయిన్లోని భారతీయ రాయబార కార్యాలయంతో పాటు ఇతరత్రా ఉన్నతాధికారులు యుద్ధభయంతో ఎవరి గోలలో వాళ్ళుండుంటారు. ఈ సమయంలో భారతీయ విద్యార్ధుల గురించి పట్టించుకునే దిక్కే కనబడటంలేదు.
కొద్ది రోజులుగా తమ భద్రతకు చర్యలు తీసుకోవాలని మన విద్యార్ధులు అడుగుతున్నా రాయబార కార్యాలయం పెద్దగా స్పందించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.