అమెరికాకే ఓటేస్తున్న ఇండియన్స్

Update: 2015-10-21 22:30 GMT
అవకాశాల గని అమెరికా మీద భారతీయుల మోజు రోజురోజుకీ మరింత పెరిగిపోతోంది. ఉద్యోగుల విషయంలోనూ అమెరికా వైపే ఓటేస్తున్నారు. స్వదేశంలో కంటే విదేశంలోనే తమకు సౌకర్యంగా ఉందన్న మాటను చెబుతున్నట్లగా తాజాగా నిర్వహించిన ఓ సర్వే స్పష్టం చేయటం గమనార్హం. భారత్ లో కంటే అమెరికాలోనే సౌకర్యంగా ఉందని.. తాము చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అంశాల్లోనూ మెరుగ్గా ఉందని.. ఒత్తిడి తక్కువగా ఉందని పేర్కొనటం విశేషం.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 500 మంది భారతీయ ఉద్యోగులపై నిర్వహించిన సర్వేలో బయటకొచ్చిన పలు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. జాబ్ చేసే సమయంలో అమెరికాకు ఓటేస్తున్న వారు.. రిటైర్ అయ్యాక మాత్రం స్వదేశం వైపే చూడటం ఒక విశేషంగా చెప్పొచ్చు. ఇక.. సదరు సర్వేలో బయటకొచ్చిన అభిప్రాయాలు చూస్తే..

= జాబ్ టెన్షన్ భారత్ తో పోలిస్తే అమెరికాలోనే చాలా తక్కువ. ఈ విషయాన్ని 63 శాతం మంది పేర్కొనటం గమనార్హం.

= అనుకున్న జీతం తమకు అందుతుందని 65 శాతం మంది చెబుతున్నారు.

= అనుకున్న జీతాన్ని సంపాదించేందుకు అదనంగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తోందని 61 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

= జాబ్ లో పెరుగుదల భారత్ కంటే అమెరికాలోనే ఎక్కువ.

= భారత్ లో కంటే అమెరికాలోనే ఉద్యోగం చేయటం సౌకర్యంగా ఉంది.

= అవకాశాల విషయంలో భారత్  కంటే అమెరికానే మెరుగైంది.

= ఉద్యోగం అమెరికాలో చేసినా.. రిటైర్మెంట్ తర్వాత మాత్రం భారత్ అనువైనది.

= చేసే ఉద్యోగం కంటే మెరుగైన నైపుణ్యం ఉందని 83 శాతం మంది చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News