తెలుగు నేర్పి పుణ్యం క‌ట్టుకోండి త‌మ్ముళ్లు!

Update: 2018-07-10 05:40 GMT
వ‌స్తే వ‌చ్చు అని చెప్పాలి. రాకుంటే రాద‌న్న‌ది నిజాయితీగా ఒప్పేసుకుంటే స‌రి. కానీ.. రానిది వ‌చ్చిన‌ట్లుగా క‌వ‌ర్ చేస్తేనే తిప్ప‌లంతా. ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ రాష్ట్ర మంత్రి లోకేశ్ తీరు ఇదే రీతిలో సాగుతోంది. ఆయ‌న తెలుగు రాద‌ని చెప్ప‌టం లేదు కానీ.. భాష‌లో ఏ ప‌దానికి ఏ అర్థం అన్న విష‌యంపై చిన‌బాబుకు అవ‌గాహ‌న త‌క్కువ‌న్న విష‌యం అర్థ‌మ‌వుతున్న‌దే.

ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌డికి ఏదో ఒక బ‌ల‌హీన‌త ఉంటుంది. అలానే చిన‌బాబుకు త‌ప్పులు మాట్లాడ‌టం అన్న‌ది బ‌ల‌హీన‌త‌. కాకుంటే.. దాన్ని అధిగ‌మించేందుకు ఆయ‌నేమైనా చేస్తున్నారా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకిలా అంటే.. ఇప్ప‌టికే త‌న నోటి మాట‌ల‌తో లోకేశ్ ఎంత కామెడీ కావాలో అంత అయ్యారు.

ఎప్పుడేం మాట్లాడ‌తారో అర్థం కాని రీతిలో మాట్లాడే లోకేశ్ పుణ్య‌మా అని.. విప‌క్షాలు ఆయ‌న మీద స‌టైర్లు చేసుకునే ప‌రిస్థితి. ఇక‌.. సోష‌ల్ మీడియాలో అయితే ఆయ‌న మాట‌ల మీద ఉండే జోకుల‌కు లెక్కే లేదు. ఆ మ‌ధ్య‌న జ‌యంతిని వ‌ర్థంతి అన‌టం.. జ‌యంతిని వ‌ర్థంతిగా మార్చ‌టం.. సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మ‌న‌ల్ని మ‌న‌మే ఉరి వేసుకుందామ‌న్న ఆణిముత్యం లాంటి మాట‌ల ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టికి ఎన్నో వ్యాఖ్య‌లు ఆయ‌న నోటి నుంచి జాలువారిన‌ ప‌రిస్థితి.

లోకేశ్ తెలుగుపై ప‌లువురు జోకులు వేసుకుంటున్నా ఆయ‌న‌లో మాత్రం మార్పు రావ‌టం లేదు. త‌న‌ను తాను మార్చుకునే విష‌యంలో చిన‌బాబు దృష్టి సారించ‌లేద‌న్న‌ట్లుగా ప‌లువురు చెబుతారు. ఈ మాట‌లు నిజ‌మ‌న్న‌ట్లుగా తాజాగా క‌ర్నూలులో ఆయ‌న జ‌రిపిన ప‌ర్య‌ట‌న‌లో మ‌రోసారి రుజువైంది. ఎన్టీఆర్ ను ముఖ్య‌మంత్రిన చేసిన ఘ‌న‌త ఇందిరాగాంధీదేన‌ని లోకేశ్ వ్యాఖ్యానించారు.

కుట్ర చేసి ఎన్టీఆర్ ను గ‌ద్దె దింపిన ఇందిర‌మ్మ‌.. తెలుగోళ్ల ప్ర‌జా ఉద్య‌మానికి భ‌య‌ప‌డి నెల రోజుల వ్య‌వ‌ధిలోనే తిరిగి ఎన్టీఆర్ చేతికి పాల‌నా ప‌గ్గాలు అందిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. తెలుగోళ్ల ప్ర‌జాగ్ర‌హానికి భ‌య‌ప‌డిన ఇందిర‌మ్మ తాను తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యాన్ని స‌రి దిద్దుకున్నారు. చ‌రిత్ర‌లో స్ప‌ష్టంగా న‌మోదైన ఈ ఉదంతం గురించి రిపోర్ట్ చేసేట‌ప్పుడు ప‌దాల పొందిక చాలా అవ‌స‌రం. కానీ.. అవేమీ ప‌ట్టించుకోని లోకేశ్‌.. తాజాగా క‌ర్నూలు జిల్లా బ్రాహ్మ‌ణ‌కొట్టూరులో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ను సీఎంను చేసిన ఘ‌న‌త ఇందిరాగాంధీదేనంటూ వ్యాఖ్యానించి షాకిచ్చారు.  ఫుల్ మెజార్టీ ఉన్నా అన్న‌గారిని గ‌ద్దె దింపితే తెలుగు ప్ర‌జ‌లు గ‌ర్జించార‌ని.. ఆ ధాటికి త‌ట్టుకోలేక మ‌ళ్లీ అన్న‌గారిని ఇందిరాగాంధీ సీఎం చేశార‌ని వ్యాఖ్యానించాల్సింది. కానీ.. ఘ‌న‌త‌ను చేర్చ‌టంతో అర్థం మొత్తం మారిపోయి. చిన‌బాబు తెలుగును ఎట‌కారం చేసుకునే అవ‌కాశం ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News