ఇది పాశ్చాత్య సంస్కృతి పెచ్చరిల్లుతున్న కాలం.. మన తాతల కాలంలో పెళ్లి తర్వాతే అన్నీ జరిగేవీ.. కానీ నేటి ఆధునిక యుగంలో పెళ్లితో సంబంధం లేకుండానే యువతీ యువకులు అన్నీ కానిచ్చేస్తున్నారు. స్వేచ్ఛ, సంపాదన, సమానత్వం ఇలా అన్ని సౌకర్యాలు ఉండడంతో తమికిష్టమైన భాగస్వామితో పెళ్లికి ముందే సెక్స్ సుఖాన్ని అనుభవిస్తున్న వారు ఎందరో.. పెళ్లికి ముందే సెక్స్ చేయవద్దనే నిబంధనను పాటిస్తున్నది తక్కువ మంది మాత్రమేనని ఓ సర్వేల్లో కూడా వెల్లడైంది.
అయితే పెళ్లికి ముందు సెక్స్ చేయకూడదని ఏకంగా ఓ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఇండోనేషియా ప్రభుత్వం ఈ మేరకు కొత్త చట్టం చేసింది.ఈ బిల్లుతో అబార్షన్లు తగ్గుతాయని.. విచ్చలవిడి శృంగారానికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. పెళ్లికి ముందు ఎవరైనా సెక్స్ చేస్తే వారికి ఏడాది పాటు జైలు శిక్ష పడుతుందని చట్టంలో రూపొందించారు. ఇక వివాహేతర సంబంధం పెట్టుకునే వారికి ఆరు నెలల జైలుశిక్ష.. ఆబార్షన్ చేసుకుంటే మహిళకు నాలుగేళ్ల జైలు విధిస్తారని చట్టంలో ఉంది.
ఈ చట్టంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏకంగా ప్రజలు ఇండోనేషియా పార్లమెంట్ ను ముట్టడించారు. వెంటనే పెళ్లికి ముందు సెక్స్ కు నో చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసనలతో ఇండోనేషియాలో హోరెత్తిస్తున్నారు. టియర్ గ్యాస్, వాటర్ కేనన్లతో ఆందోళనకారులపై ప్రభుత్వం అణిచివేయాలని చూసినా అదుపులోకి రావడం లేదట.. దీంతో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తాత్కాలికంగా ఈ చట్టాన్ని వాయిదా వేశారు. మరోసారి పరిశీలించి ఆమోదంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఆందోళనల్లో ఎక్కువగా విద్యార్థులే పాల్గొనడం విశేషం.