తుపాకుల మోతలు.. భయం భయం బతుకులు.. శవాల కుప్పలు.. ఎప్పుడు లాక్డౌన్ పడుతుందో తెలియని అయోమయం.. ఒకప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోపి పరిస్థితులు ఇవి. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. ఇక్కడున్న వారిలో ఆశలు పెరుగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాశ్మీర్ వాసుల కల నెరవేరబోరతుంది. సాధారణ జీవితం గడుపుతామనుకున్నవారి కోరిక నిజం కాబోతుంది.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు తరువాత జరుగుతున్న పరిణామాలు ఇవి. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో లాగా ఇక్కడ సాధారణ జీవితం సాగబోతుందా..? కేంద్రం చెప్పినట్లుగానే జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టిందా..? అంటే అవుననే అనిపిస్తోంది.
ఎన్నో అడ్డంకులు, విమర్శల మధ్య బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ఉన్న 370 ఆర్టికల్ ను రద్దు చేసింది. ఈ ఆర్టికల్ రద్దు తరువాత చాలా రోజులు ఇక్కడ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు కొంత మందికి ఇష్టం లేదు. స్వతంత్రంగా బతుకుతున్న తమ జీవితాలను నాశనం చేయబోతున్నారని కొందరు ప్రచారం చేశారు. కేంద్రం పెత్తనం ఉంటే ఇక్కడి పరిస్థితులు వేరేలా ఉంటాయని భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ విమర్శలను తిప్ప కొట్టింది. 370 ఆర్టికల్ రద్దు తరువాత జరిగే పరిణామాలను ముందే తెలిపింది. అనుకున్నట్లుగానే ఇక్కడి పరిస్థితులు మారుతున్నాయి.
గత కొన్ని రోజులుగా కాశ్మీర్లో పెట్టుబుడులు పెట్టేందుకు చాలా పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. వాస్తవానికి 370 ఆర్టికల్ రద్దు వెంటనే కొందరు పారిశ్రామిక వేత్తలో ఆశలు చిగురించాయి. అయితే ప్రభుత్వ అనుమతి కోసం ఇన్నాళ్లు వేచి చూశారు. ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో క్యూ కడుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు భూములను ప్రభుత్వం కేటాయిస్తోంది. దీంతో పండ్ల తోటల పెంపకం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటి వరకు జమ్మూలో రూ.12 వేల కోట్ల, కాశ్మీర్లో 13వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయట. చాలా దశాబ్దాల తరువాత ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే మొదటి సారి. దీంతో స్థానిక మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 50 వేల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రదేశాల్లో యాపిల్, చెర్రీ, బాదం తోటలు బాగా పండుతాయి. అలాగే గెర్రెల పెంపకం కూడా జరుగుతంది. వాటి అనుబంధంగా పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు.
పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగా, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. నిత్యం తీవ్రవాదం, పోలీసుల పహారాతో సాగిన వాతావరణంలో చాలా మంది యువత కు ఉపాధి లేకుండా పోయింది. కొందరు చేసేదేమీ లేక తీవ్రవాదంలో కలిసిపోయేవారు. అయితే పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వస్తాయని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు జోరుగా సాగుతుండడంతో యువతలోనూ ఆనందం వ్యక్తం అవుతోంది.
స్వదేశీ నుంచే కాకుండా విదేశీ పరిశ్రమలు జమ్మూకాశ్మీర్లు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా చల్లటి వాతావరణం ఉంటుంది. ఇక కాశ్మీర్లోనూ అదే వాతావరణం కలిగి ఉండడంతో విదేశీయులు ఇక్కడ ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొందరు అవసరమైతే ఇక్కడే లైఫ్లాంగ్ ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిక ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రం కుడా సుముఖత వ్యక్తం చేస్తోంది. ఏదీ ఏమైనా 370 ఆర్టికల్ రద్దు తరువాత ప్రయోజనం కలిగిందనేది తెలుస్తోంది.