అప్పుడు మోడీ.. ఇప్పుడు స‌మాచార శాఖ ట్విట్ట‌ర్ ఖాతా హ్యాక్‌

Update: 2022-01-12 08:44 GMT
భారత్లో ట్విట్టర్ ఖాతాలు తరచూ హ్యాకింగ్కు గురవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ రోజు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతా కొద్ది నిమిషాల పాటు హ్యాక్కు గురైంది. అయితే వెంటనే ఖాతాను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు.

హ్యాకర్లు కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన అనంతరం వరుసుగా 50కిపైగా ట్వీట్లు చేశారు. హరీ అప్(Hurry Up) , అమేజింగ్ (Amazing) అంటూ రాసి వాటి కింద టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫొటోతో హైపర్లింక్లు పెట్టారు. ఈ ట్వీట్లు గందరగోళానికి గురి చేశాయి. వెంటనే అధికారులు ఖాతాను పునరుద్ధరించి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు.

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ట్విట్టర్ ఖాతా బుధవారం హ్యాక్ అయ్యింది. పైగా హ్యకర్లు ఖాతా పేరును ఎలెన్‌ మస్క్‌ అని పేరు మార్చారు. అంతేకాదు ప్రోఫైల్‌లో చేప ఫోటో పెట్టారు. అదే సమయంలో కొన్ని ట్వీట్లు కూడా చేశారు. అయితే కొద్ది సమయంలోనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆ ఖాతాను  రికవరి చేసిందని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఆ ట్విట్టర్‌ ఖాతా యథావిధిగా పనిచేస్తోంది. ఆ ట్వీట్లు కూడా తొలగించారు.

అయితే హ్యాకర్లు గతంలో ప్రధాని మోడీ ఖాతాను హ్యాక్‌ చేసిన వారే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఖాతాను కూడా హ్యాక్‌ చేసి ఉండవచ్చు. ఎందుకంటే అప్పుడూ మోడీ ఖాతా హ్యాక్‌ అయినప్పుడు ఏం కంటెంట్‌ ఉందో అదే కంటెంట్‌ ఈ ఖాతాలో కూడా ఉంది. ఇటీవల చాలామంది ప్రముఖుల ఖాతాలు హ్యాక్‌ అయిన సంగతి తెలిసిందే.

సరిగ్గా నెల రోజుల క్రితం డిసెంబర్ 12న కూడా ప్రదాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్కు గురికావడం గమనార్హం. హ్యాకర్లు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టు పెట్టారు. లోపాలను సవరించి కాసేపటికే ప్రధాని ఖాతాను అధికారులు పునరుద్ధరించారు. ఇక‌, ఇప్పుడు ఈ ఘ‌ట‌న‌పైనా విప‌క్షాలు.. తీవ్ర విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News