ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ ప్రారంభం

Update: 2020-12-28 05:45 GMT
కృష్ణాజిల్లాలోని గన్నవరంలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఐదు సెంటర్లలో ఎంపిక చేయబడిన 125 మందికి డమ్మీ టీకాలు వేయనున్నారు. వీటిని పర్యవేక్షించడానికి ఐదుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లు నియమించారు. కలెక్టర్ అధ్యక్షతన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ లో లోపాలను గుర్తించేందుకు ఈ డ్రైరన్ నిర్వహిస్తున్నారు.

ఇక టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వెంటనే ట్రీట్ మెంట్ చేసేలా కృష్ణ జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ట్రయల్ రన్ తర్వాత టీకా వేసే తేదిపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే ఏపీ  స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు 30 లక్షల సిరంజీలు చేరగా.. త్వరలోనే ఇక్కడ 57 వేల లీటర్ల టీకాను భద్రపరచనున్నారు. తొలి విడతగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 50 ఏళ్లు దాటిన వారికి టీకా ఇవ్వనున్నారు.

ఈరోజు నుంచి రెండు రోజుల పాటు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కు ఏర్పాట్లు చేశారు. ఏపీ, గుజరాత్, పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లోని రెండేసి జిల్లాల్లో 2 రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం జరుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Tags:    

Similar News