వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని మంత్రులు ఎవరు? ఏపీ సీఎం జగన్ దగ్గర కూడా తమకు పలుకుబడి ఉందని.. ఈ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని. భావిస్తున్న మంత్రులు ఎవరు? ఇదీ.. ఇప్పుడు మంత్రుల మధ్య చర్చకు వచ్చిన అంశం. ఎందుకంటే.. రెండున్నరేళ్లలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ముందు.. ఇప్పటికే ఉన్న మంత్రులు పలు ప్రతిపాదనలు పెట్టారు..కానీ, వాటిలో ఏవీ కూడా ముందుకుసాగడం లేదు. మరోవైపు.. ఎప్పుడు తమకు పదవీ గండం ఉంటుందోనని మంత్రులు బిక్కటిల్లుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. మా పనులు చేయడం లేదంటే. మా పనులు చేయడం లేదంటూ.. ఏ ఇద్దరు మంత్రులు కలిసినా.. చర్చించుకుంటున్నారు. అయితే.. ఓ ఇద్దరు మంత్రులు ఇచ్చిన ప్రతిపాదనలు మాత్రం సక్సెస్ అయ్యాయని వీరు చర్చించుకుంటున్నారు.
దీంతో సీఎం జగన్ దగ్గర మంచి పలుకుబడి ఉన్న మంత్రులు ఎవరు? వారు ఎలా సీఎం ను కాకా పట్టారు? అనే విషయాలపై చర్చ సాగుతోంది. వారే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెండోవారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ ఇద్దరు మంత్రులకు ..జగన్ అన్నీ చేసి పెడుతున్నారనేది ఇతర మంత్రుల ఆరోపణ.
ఇక, ఈ ఇద్దరు మంత్రుల స్టయిల్‌ను పరిశీలిస్తే.. వారు డౌన్‌టు ఎర్త్‌గా ఉంటున్నారు. అవకాశం వస్తే.. తప్ప.. వారు జగన్‌ను ఆకాశానికి ఎత్తేయరు. అంతేకాదు.. వారుఏంచేయాలన్నా.. సీఎం జగన్‌కు చెప్పే చేస్తున్నారు. ఒకరు పార్టీ కార్యక్రమాలను చక్కబెడుతుంటే. మరొకరు ఆర్థికంగా.. ప్రభుత్వానికి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీంతో జగన్‌కు అన్ని విషయాలూ చూసుకునే తలనొప్పి లేకుండా పోయింది.
కానీ, ఇతర మంత్రులను చూస్తే.. అన్ని విషయాలు.. జగన్‌కుచెబుతున్నారు. అక్కడ ఆ సమస్య ఉంది. ఇక్కడ ఇలా ఉంది.. అంటూ.. ఏకరువు పెడుతున్నారట. దీంతో ఇలాంటి వారిని జగనే పక్కన పెట్టారని.. అంటున్నారు. అంటే... ఇప్పుడు మారాల్సింది జగన్‌కాదు.. మనమే అని వారు తేల్చుకున్నట్టు తెలుస్తోంది. మరి ఎలా మారతారో చూడాలి.