కష్టపడి.. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ పార్టీని పెంచి పెద్దది చేయటమే కాదు.. ఏపీలో అధికారపక్షంగా.. తిరుగులేని రీతిలో పార్టీని తయారు చేయటం ఇవాల్టి రోజున అంత ఈజీ కాదు. అందునా.. బలమైన క్యాడర్ ఉన్న ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు.
ఈ విషయంలో జగన్ కు ఎదరయ్యే సవాళ్లు అన్ని ఇన్ని కావు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వ రాజకీయానికి.. తన తెలివిని జోడించి.. పార్టీని పవర్లోకి తీసుకురావటంలో సక్సెస్ అయినప్పటికి.. ఆ జోరును కొనసాగించే విషయంలో మాత్రం తప్పటడుగులు పడుతున్నాయి.
ఊహించని రీతిలో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకొని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటే.. ఆర్నెల్ల వ్యవధిలో తనను వ్యతిరేకించే వారి మనసుల్ని దోచుకుంటామన్న మాట విన్నప్పుడు.. చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. తన తీరుకు భిన్నంగా వచ్చిన మాటలకు ఫిదా అయ్యారు.
ఒకవేళ జగన్ కానీ తాను చెప్పినట్లుగా చేతల్లో చూపిస్తే.. ఆయనకు తిరుగు ఉండదన్న అంచనాలు వినిపించాయి.
మాటల్ని చెప్పటం వేరు.. వాటిని అమలు చేయటం అంత తేలిక కాదన్న విషయం జగన్ అండ్ కో తీరు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వానికి ఎదురైన అడ్డంకులు.. అవాంతరాలు ఒక ఎత్తు అయితే.. గడిచిన కొద్ది రోజులుగా ఆయనకు ఎదురవుతున్న సవాళ్లు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పార్టీకి.. ప్రభుత్వానికి మేలు చేయకున్నా ఫర్లేదు.. చేటు చేయటంతోనే తిప్పలన్నీ. తాజాగా మంత్రి కొడాలి నాని సంగతే తీసుకుంటే.. ఇప్పుడాయన తీరు పార్టీలోని పలువురిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది.
ప్రత్యర్థి పార్టీ అధినేతపై విరుచుకుపడటం తప్పేం కాదు. కానీ.. హద్దులు దాటేస్తున్న ఆయన మాటలు.. సొంత పార్టీ వారికి సైతం చిరాకును తెప్పిస్తున్నాయన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీ తప్పుల్ని ఎత్తి చూపించి.. వారు ఆత్మరక్షణలో పడేలా చేయాలే కానీ.. అందుకు భిన్నంగా వారిని ఇష్టారాజ్యంగా తిట్టిపోస్తూ.. మర్యాదస్తులన్న వారెవరూ జీర్ణించుకోలేని రీతిలో మాట్లాడటం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకోవటాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు.
కొడాలి నానితో పాటు.. టీడీపీ బొమ్మపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీలాంటోళ్లు సొంత పార్టీ అధినేత మీద విరుచుకుపడటం బాగానే ఉన్నా.. వారి మాటలు ప్రభుత్వానికి లాభం చేసే కన్నా నష్టాన్ని కలిగిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో మరే నేత ప్రయోగించని భాషను వాడేస్తూ.. ఇష్టం వచ్చినట్లుగామాట్లాడటంఒక ఎత్తు అయితే.. వారి చేష్టలతో పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. మొన్నటికి మొన్న సంక్రాంతి వేళ.. గుడివాడలో జరిగిన క్యాసినో హడావుడి ఊరంతా హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశం వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ తెగ హల్ చల్ అయ్యింది.
ఇలాంటి వాటి మీద వెనుకా ముందు చూసుకోకుండా సవాళ్లు విసరటం ద్వారా.. మాటలతో తిమ్మినిబమ్మిని చేయటం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా కొడాలి నాని సవాలు.. అందుకు ప్రతిగా బయటకు వచ్చిన వీడియోలు.. ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. పార్టీకి.. ప్రభుత్వానికి భస్మాసుర హస్తాలుగా మారినట్లుగా వైసీపీ నేతలు చెవులు కొరుక్కోవటం కనిపిస్తోంది.ఇలాంటి వారిని అధినేత జగన్ ఎందుకు ఉపేక్షిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. కొడాలి.. వల్లభనేని లాంటి వారి కారణంగా పార్టీకి మేలు జరుగుతుందని చూసి చూడనట్లుగా ఉండటం రాబోయే రోజుల్లో మరింత నష్టం వాటిల్లేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వారి విషయంలో అధినేత దృష్టి సారించాలన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.