తండ్రిని చంపే కొడుకు.. భర్తను చంపే భార్య.. కన్న కూతుర్ని పొట్టనపెట్టుకునే తల్లి.. ఇలా కలలో కూడా ఊహించని దుర్మార్గాలు ఇటీవల కాలంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటివేళ.. మానవత్వంతో.. మనకేమీ కాని వ్యక్తి కోసం తపించే వారు అసలు ఉన్నారా? అయిన వాళ్లను.. రక్త సంబంధీకుల్ని నిర్మోహమాటంగా చంపేస్తున్న దుర్మార్గ ప్రపంచంలోకి మనం వెళ్లిపోతున్నామన్న ఆందోళన వేళ.. అందుకు భిన్నంగా మంచి బోలెడంత మన చుట్టూనే ఉంది. మన తరచూ వింటున్న ఉదంతాలకు మించిన మంచి చాలానే ఉందన్న భావన కలిగేలా చేస్తుంది తాజా ఉదంతం.
అయిన వాళ్లకే ఏమీ చేయని ఈ రోజుల్లో.. ఇంట్లో పని చేసే పనిమనిషి కోసం ఒక జంట రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టి.. రోజుకు ఐదారు గంటల పాటు కష్టపడుతున్న వైనం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఫేస్ బుక్ పుణ్యమా అని ఈ విషయం లోకానికి తెలిసింది. దీపాళి భాటియా అనే వ్యక్తి ఈ అద్భుతమైన జంట గురించి సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మధ్యనే ముంబయి రైల్వే స్టేషన్ లో దిగిన టిఫిన్ చేయటానికి వెళ్లిన ఆయనకు ఒక జంట కనిపించింది. చూసేందుకు సంపన్నులుగా కనిపించిన వారు.. రోడ్డు పక్కన టిఫిన్ అమ్ముతున్న వైనంతో ఆశ్చర్యానికి గురై.. వారిని వివరాలు అడిగినప్పుడు అద్భుతమైన మానవత్వం ఆయన కళ్ల ముందు కనిపించింది. ముంబయికి చెందిన అశ్విన్ ఆమె భర్త ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ మధ్యన వారింట్లో పని చేసే మహిళ భర్త అనారోగ్యానికి గురయ్యాడు. పక్షవాతంతో బాధపడుతున్న అతడికి సాయంగా నిలిచేందుకు వీరు కొంత డబ్బును సాయంగా ఇచ్చారు. అందుకు ఆ పని మనిషి ఒప్పుకోలేదు. దీంతో.. ఆ కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలనుకున్నఈ ఇద్దరూ.. పని మనిషి ఇంట్లో ఉండి తయారు చేసిన టిఫిన్ ను అమ్మాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డుపక్కన వీరు టిఫిన్ బండిని ఏర్పాటు చేశారు. పని మనిషి స్వయంగా వండిన ఇడ్లీ.. పోహో.. ఉప్మా.. పరాఠా అమ్ముతూ వచ్చిన డబ్బును పని మనిషికి అందజేస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ వీరు ఈ పని చేసి.. తర్వాత తమ ఉద్యోగాలకు వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న దీపాళి భాటియా షాక్ తినటమే కాదు.. ఇవాల్టి రోజుల్లో సాటి మనిషి కోసం వారు చేస్తున్న పని గురించి తెలిసి ఉప్పొంగిపోవటమే కాదు.. వారి గొప్పతనం అందరికి తెలియాలన్న ఉద్దేశంతో తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ లో పోస్టు రూపంలో పెట్టి.. వారి ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడీ మెసేజ్ వైరల్ గా మారి.. వారి ప్రయత్నానికి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.