మోనాలిసా నవ్వు చెదరకుండా ఉండేందుకు అన్ని తిప్పలు పడుతున్నారట

Update: 2022-08-02 04:54 GMT
పెయింటింగ్ లు ఎన్నో ఉండొచ్చు. అవేమీ మోనాలిసాకు సాటి వచ్చేవి ఉండవన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. వందల ఏళ్ల క్రితం గీసిన ఈ చిత్రం మీద జరిగినంద రీసెర్చ్ మరే పెయింటింగ్ మీద జరగలేదనే చెప్పాలి. ఈ పెయింటింగ్ మీద బోలెడన్ని పుస్తకాలు వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇప్పటికి మోనాలిసా నవ్వు వెనుకున్న మర్మాన్నిమాత్రం మిస్టరీగా మారింది. దీనిపై జరుగుతున్న పరిశోధనలు.. అప్పుడప్పుడు కొన్ని వివరాల్ని వెల్లడిస్తున్నా.. ఇప్పటికి ఈ పెయిటింగ్ కు సంబంధించి ఉన్న సందేహాలు అన్ని ఇన్ని కావు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అత్యంత విలువైన చిత్రాన్ని పర్యవేక్షించటం.. దాన్ని జాగ్రత్తగా కాపాడటం.. దాని ఒరిజినాలిటీ మిస్ కా కుండా సేవ్ చేయటానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పారిస్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొలువు తీరిన మోనాలిసా పెయింటింగ్ ను పర్యవేక్షించటం.. దాని ముఖంలోని నవ్వు వెనుకున్న మిస్టరీని చేధించేందుకు వేలాది గంటలు కష్టపడుతున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. వందల ఏళ్ల నాటి మోనాలిసా పెయింటింగ్ చెడిపోకుండా.. దాన్ని అంత భద్రంగా.. జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వెల్లడయ్యాయి. ఇదంతా తెలిసిన వారికి ఒక పెయింటింగ్ కోసం ఇంతలా శ్రమిస్తున్నారా? అన్న సందేహం కలుగక మానదు. లియోనార్డీ డా విన్సీ గీసిన ఈ చిత్రం ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతుందని చెప్పాలి. ఇప్పటికే ఈ పెయింటింగ్ అంటే చాలామందికి అదోలాంటి క్రేజ్ అన్న విషయం తెలిసిందే.

పారిస్ లోని లౌరే మ్యూజియంలో భద్రంగా ఉన్న ఈ ఒరిజినల్ మోనాలిసా పెయింటింగ్ ను చెక్కు చెదరకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించటంతో యావత్ ప్రపంచం.. నివ్వెరపోయింది. పెయింటింగ్ లను సమర్థంగా నిర్వహించటానికి (మొయింటైన్) వీలుగా తామెంత శ్రమ పడుతున్న విషయాన్ని వెల్లడించారు.

మోనాలిసా పెయింటింగ్ ఒరిజినాలిటీ మిస్ కాకుండా ఉండేందుకుపెద్ద సెటప్ ను నిర్మించారు. పారిస్ లోని ఒక భారీ అండర్ గ్రౌండ్ కూలింగ్ సిస్టం అందులో ఉంది. భూమికి దాదాపు 98 అడుగుల లోతులో ఉన్న ఈ కూలింగ్ నెట్ వర్క్ కోసం సుమారు 89 కిలోమీటర్ల వరకు ఐస్ వాటర్ ను పంపింగ్ చేస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. నిర్దేశించిన 700 ప్రాంతాల్లో ఈ చల్లటి నీటిని పంపింగ్ చేయటం ద్వారా అక్కడి వాతావరణం చల్లబడుతుందని చెబుతున్నారు.

ఈ వ్యవస్థ మొత్తాన్ని పునరుత్పాదక వనరులతో ఉత్పత్తి చేసిన విద్యుత్ ను దీని కోసం వినియోగిస్తున్నారు. ఇది ఐరోపాలోనే అతి పెద్ద కూలింగ్ సిస్టం అని చెబుతున్నారు. ప్రస్తుతం ఐరోపా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ వేడిని అక్కడి ప్రజలు అస్సలు భరించలేకపోతున్నారు.

ఇలాంటి వేళ.. మోనాలిసా పెయింటింగ్ ను కాపాడుకోవటం కోసం లౌరే మ్యూజియాన్ని ఈ కూలింగ్ నెట్ వర్కుతో నిర్వహిస్తున్నారు. ఆసక్తికకరమైన విషయం ఏమంటే.. ఇప్పుడెన్నో అత్యాధునిక కూలింగ్ సిస్టం వచ్చినప్పటికీ 1990 నాటి నుంచి ఫాలో అవుతున్న కూలింగ్ సిస్టంను ఇప్పటికి వినియోగిస్తున్నారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వేళలో చోటుచేసుకునే ఉక్కుపోతతో మోనాలిసా పెయింటింగ్ దెబ్బ తినకుండా ఉండటానికి.. ఐస్డ్ కోల్డ్ వాటర్ ను పంపింగ్ చేస్తూ.. మ్యూజియంలోని వాతావరణాన్ని నియంత్రిస్తున్నారు. ఈ ఆర్ట్స్ వర్క్స్ ఉన్న మ్యూజియంలో ఏకంగా 5.5 లక్షల ఆర్ట్ వర్క్స్ ఉన్నట్లుగా చెబుతారు. ఇలా తీసుకునే ఎన్నో జాగ్రత్తలతో మోనాలిసా మౌన నవ్వును కాపాడుకుంటూ వస్తున్నారు.
Tags:    

Similar News