అమరావతిలో సుజనా స్కామ్..గుట్టు బయటపడనుందా?

Update: 2019-09-21 07:17 GMT
అమరావతిలో సుజనా చౌదరికి భారీగా భూమలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఇటీవల రాజధానిని అమరావతి నుంచి కదిలించకూడదని సుజనా చౌదరి హడావుడి చేసిన సమయంలో ఆయన బినామీలకు భారీ ఎత్తున అమరావతిలో భూములున్నాయంటూ జగన్ మోహన్ రెడ్డి సొంత పత్రిక పెద్ద కథనాన్ని ఇచ్చింది. తనకు సెంటు భూమి లేదంటూ సుజనా చేసిన ప్రకటనపై బినామీల పేర్లంటూ వందల ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలను ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇలాంటి నేపథ్యంలో సుజనా చౌదరి గుట్టు బయటపెట్టడానికి రంగం సిద్ధం అవుతోందని సమాచారం. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ - ఏసీబీల ద్వారా గుట్టు బయట పెట్టుందని టాక్. సుజనా చౌదరి కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీ నేతగా చలామణి అవుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా నామినేట్ అయినా, ఫిరాయించి.. దాన్ని విలీనంగా మార్చుకున్నారు.

ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతగా ఆయన చలామణి అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కూడా ఆయన గుట్టును బయటపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందని సమాచారం.

అమరావతిలో భారీ స్కామ్ జరిగిందని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చే ఆధారాలను బయటపెట్టి.. మొత్తం గుట్టును బయటపెట్టడానికి రంగం సిద్ధం అవుతోందని టాక్!

Tags:    

Similar News