2013 నాటి ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం ఎంతటి విపత్కర పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. ఆ కుంభకోణం వల్ల ఏకంగా రెండు ఫ్రాంఛైజీల మీద రెండేళ్ల పాటు నిషేధం పడింది. జట్టు యజమానులే బెట్టింగ్ లో పాల్గొనడంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు రెండేళ్ల పాటు ఐపీఎల్ కు దూరమై వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయి. ఇప్పుడు మరో ఐపీఎల్ ఫ్రాంఛైజీని నిషేధం ముప్పు ఎదుర్కొంటోంది. ఆ ఫ్రాంచైజీనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్. దీని యజమానుల్లో ఒకరైన నెస్ వాడియా జపాన్ లో డ్రగ్స్ కుంభకోణంలో దొరికిపోవడంతో రెండేళ్ల జైలు శిక్ష పడ్డ సంగతి తెలిసిందే. దీంతో అతడి వ్యాపార సామ్రాజ్యానికి పెద్ద ముప్పే వాటిల్లింది. అతడి సంస్థల షేర్లన్నీ పడిపోయాయి. ఇప్పుడు అతడి భాగస్వామ్యం ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీకి కూడా ముప్పు తప్పేలా లేదు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంఛైజీల యజమానుల్లో ఎవరైనా ఆటకు సంబంధించే కాక ఆటేతర వ్యవహారాల్లోనూ తప్పు చేసి ఫ్రాంఛైజీకి, లీగ్ కు చెడ్డ పేరు తెస్తే ఆ ఫ్రాంఛైజీని సస్పెండ్ చేయొచ్చు. లేదా నిషేధించొచ్చు. నెస్ వాడియా వ్యవహారం ఆటకు సంబంధించినది కాకపోయినా.. అతడి లాంటి వ్యక్తి ఫ్రాంఛైజీకిి యజమానిగా ఉండటం వల్ల వల్ల ఐపీఎల్ కు చెడ్డ పేరు వస్తుందని భావిస్తే ఆ ఫ్రాంఛైజీని సస్పెండ్ చేయడమో, బ్యాన్ చేయడమో చేయొచ్చు. ఈ విషయంలో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణాన్ని విచారించిన లోధా కమిటీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని అనుసరించి బీసీసీఐ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. ఈ లోపు నెస్ వాడియాను ఫ్రాంఛైజీని సాగనంపి అతడి తాలూకు మరకలు ఫ్రాంఛైజీకి అంటకుండా ఇతర యజమానులు చూసుకుంటారేమో చూడాలి.