సెప్టెంబ‌ర్ 19 నుంచి ఐపీఎల్‌ స్టార్ట్.. ఫైనల్ ఎప్పుడంటే?

Update: 2021-06-07 12:59 GMT
ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ ఎడిషన్‌ను ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 19 నుంచి మ‌ళ్లీ ప్రారంభించాల‌ని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ మధ్యలోనే ఐపీఎల్ ను కరోనా కారణంగా ఆపేశారు, దీనితో మిగిలిన టోర్నీ యూఏఈలో జ‌ర‌గ‌నుంది. ఇక ఫైన‌ల్ మ్యాచ్ ద‌స‌రా రోజు అంటే అక్టోబ‌ర్ 15న జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే బీసీసీఐ అధికారులు యూఏఈ బోర్డుతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశం బాగా జ‌రిగింద‌ని, మిగిలి మ్యాచ్‌ ల‌ను దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తామ‌న్న విశ్వాసం బీసీసీఐలో ఉన్న‌ద‌ని బోర్డు అధికారి ఒక‌రు ఏఎన్ఐకి వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే 29 మ్యాచ్‌లు పూర్త‌యిన ఐపీఎల్‌ లో మ‌రో 31 మ్యాచ్‌ లు జ‌ర‌గాల్సి ఉంది. దీనికోసం క‌నీసం 25 రోజుల స‌మ‌యం దొరికినా చాలు.. టోర్నీని పూర్తి చేస్తామ‌ని బోర్డు చెబుతూ వ‌స్తోంది. ఇండియాలో ఎలాగూ సాధ్యం కాద‌ని భావించి టోర్నీని యూఏఈకి త‌ర‌లించారు. అయితే మిగిలిన టోర్నీకి ప‌లువురు విదేశీ స్టార్ ప్లేయ‌ర్స్ వ‌చ్చే అవ‌కాశాలు క‌న‌పించ‌డం లేదు. చాలా వ‌ర‌కూ ప్లేయ‌ర్స్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఒక‌వేళ ఎవ‌రైనా రాక‌పోతే అప్పుడు చూస్తామ‌ని స‌ద‌రు బీసీసీఐ అధికారి చెప్పారు. ఇక ఫైన‌ల్ మ్యాచ్ అక్టోబ‌ర్ 15న జ‌ర‌గ‌నుంది. దీనిపై.. బీసీసీఐ అధికారులు యూఏఈ బోర్డుతో చ‌ర్చ‌లు జ‌రిపారు.. మిగ‌తా మ్యాచ్‌ల‌ను దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో నిర్వ‌హిస్తామ‌న్న బీసీసీఐలో వెల్ల‌డించారు. కాగా, ఐపీఎల్ 14వ ఎడిష‌న్‌లో ఇప్ప‌టికే 29 మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా.. మ‌రో 31 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
Tags:    

Similar News