ఇరానీయులకు మూడు ఆప్షన్లు ఇచ్చేసి.. మీ ఇష్టమన్నారు

Update: 2020-03-18 05:45 GMT
ప్రపంచాన్ని కమ్మేస్తున్న కరోనా కారణంగా వేలాదిగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే లక్షలాదిగా చనిపోయే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. చైనా తర్వాత కరోనా కారణంగా ఇటలీ తీవ్ర ప్రభావానికి గురైతే.. ఆ తర్వాతి దేశంగా ఇరాన్ ను చెబుతున్నారు. మధ్యప్రాచ్యంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం ఇరాన్ లోనే నమోదవుతున్నాయి.

ఇప్పటివరకూ కరోనా కారణంగా ఇరాన్ లో 988 మంది మరణించగా పదహారు వేల మందికి పాజిటివ్ అని తేలింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. ఈ దేశ రాజధాని టెహ్రాన్ లోని ప్రతిష్ఠాత్మక వర్సిటీ (షరీఫ్ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ).. ఇరాన్ అధికారిక టీవీ జర్నలిస్టు డాక్టర్ అఫ్రుజ్ ఎస్లామి ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ దేశీయులకు మూడు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసేలా సింఫుల్ గా చెప్పేశారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్నట్లుగా హెచ్చరిక ఉండటం గమనార్హం.

తాము చేసిన అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ విషయం లో దేశ ప్రజలు పూర్తిగా సహకరిస్తే.. రానున్న రోజుల్లో ఈ వైరస్ బారిన 1.2 లక్షల మంది పడే ప్రమాదం ఉందని.. 12వేల మంది వరకూ మరణించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఒకవేళ.. ఈ వైరస్ కు ప్రజలు మామూలు స్థాయిలో సహకారం అందిస్తే.. 3 లక్షల కేసులు నమోదవుతాయని.. 1.1 లక్షల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలా కాకుండా.. పౌరులు అస్సలు సహకారం అన్నదే ఇవ్వకుండా.. జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ ప్రాణాంతాక వైరస్ 40 లక్షల మందికి సోకే ముప్పు పొంచి ఉందన్నారు.ఆ సందర్భంలో మాత్రం ఏకంగా35 లక్షల మంది మరణించే అవకాశం ఉందంటూ గుండెలు అదిరిపోయేలా వార్నింగ్ ఇచ్చేశారు. చెప్పాల్సిందంతా చెప్పేసి.. ఇక మీ ఇష్టం సుమా.. అన్నట్లుగా అక్కడి వారి మాటలు ఉండటం గమనార్హం.
Tags:    

Similar News