ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ఓడిపోయింది. మణిపూర్ లో సీఎం ఒక్రామ్ ఇబోబి సింగ్ పై తౌబల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షర్మిల.. పలు రౌండ్లలో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా.. చివరికి ఓటమి తప్పలేదు. ఈ నియోజకవర్గంలో నోటాకు వచ్చిన ఓట్ల కంటే షర్మిలకు తక్కువ ఓట్లు రావడం గమనార్హం. 16 ఏళ్ల పాటు సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసిన షర్మిల.. గతేడాది దీక్ష విరమించింది. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో చేరి.. పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పార్టీని స్థాపించింది. తాజా ఎన్నికల్లో సీఎం ఇబోబి సింగ్ పై పోటీ చేసింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ విజయం సాధించారు. ఉక్కు మహిళ ఇరోన్ షర్మిలపై ఆమె విజయం సాధించారు. ఇబోబీ సింగ్ విజయం సాధించడం ఇది వరుసగా నాలుగో సారి.
కాగా, లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ ఆధిక్యతలో ఉన్నారు. ఇక్కడ రీటా బహుగుణ తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అపర్నాయాదవ్ పై ముందంజలో ఉన్నారు. ఆమె ఎస్పీ అధితనే ములాయం సింగ్ యాదవ్ రెండో కోడలు. కాగా, ప్రతి రౌండ్‌లోనూ అపర్నా యాదవ్ పై రీటా బహుగుణ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/