ఎన్నికల ఖర్చుకు రూ.10 ఇవ్వమంటోంది

Update: 2017-02-18 14:15 GMT
సుదీర్ఘకాలం ఉద్యమనేతగా.. ఐరెన్ ఉమెన్ గా సుపరిచితురాలైన మణిపూర్ ఉద్యమకారిణి కమ్ రాజకీయనేత ఇరోమ్ షర్మిల సరికొత్త తీరుతో వ్యవహరిస్తున్నారు. ఏళ్లకు ఏళ్లు ప్రత్యేక భద్రతా దళాలకు ఉన్నప్రత్యేక హక్కుల్ని తీసేయాలంటూ డిమాండ్ చేసిన ఆమె.. తన పోరుకు పుల్ స్టాప్ పెట్టి.. ఈ ఇష్యూకు రాజకీయ పరిష్కరం దిశగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా పీఆర్ జేయే పార్టీని ఏర్పాటు చేసిన ఆమె.. ఆన్ లైన్ లోవిరాళాలు సేకరించాలని డిసైడ్ అయ్యారు. మార్పు కోసం రూ.10ఇవ్వాలంటూ ఆమె ప్రజల్ని కోరుతున్నారు. ప్రజల నుంచి రూ.10 వసూలు చేయటం ద్వారా జనాలకు మరింత దగ్గర రావటంతోపాటు.. ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకు రావటానికి సాయం చేస్తుందని ఆమె చెబుతున్నారు.

ఎన్నికల కోసం ప్రజల నుంచి రూ.10 చొప్పున విరాళాలు వసూలు చేస్తున్నఏకైక ప్రాంతీయ రాజకీయ పార్టీ షర్మిలదనే చెబుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండటానికి.. వారి కష్టాల్ని తెలుసుకోవటానికి వీలుగా సైకిల్ మీదనే వెళ్లాలని భావిస్తున్నఆమె..తన పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులందరిని సైకిల్ మీదనే ప్రచారం చేయాలని కోరటం గమనార్హం. మరి.. షర్మిల అడిగినట్లుగా రూ.10 విరాళాల ప్రోగ్రాం ఏమేరకు సక్సెస్ అవుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News