మణిపూర్ కు చెందిన పౌరహక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిలా పెళ్లి ఈ రోజు జరిగింది. పదహారేళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన ఆమె గత ఏడాదే దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు.. ఇప్పుడు బ్రిటన్ కు చెందిన తన స్నేహితుడిని వివాహమాడారు.
ఇరోమ్ షర్మిల వివాహం తమిళనాడులో జరిగింది. ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం ఇరోమ్ షర్మిలా, బ్రిటీష్ పౌరుడు డెస్మండ్ కౌటినో రిజిష్టర్ వివాహం చేసుకున్నారు. కొడైకెనాల్ సబ్‌రిజిష్టార్ కార్యాలయంలో జరిగిన ఈ వివాహానికి వారిద్దరు మాత్రమే వచ్చారు. మూడోవ్యక్తిని ఎవ్వరినీ వాళ్లు ఆహ్వానించలేదు. చివరకు షర్మిల తల్లి కూడా ఈ వివాహానికి హాజరుకాలేదు.
మణిపూర్‌కు చెందిన ఇరోమ్ షర్మిలా ఆర్మ్ డ్ ఫోర్సెస్ చట్టానికి వ్యతిరేకంగా 2000 సంవత్సరం నుంచి 2016 వరకు నిరాహారదీక్ష చేశారు. ఐదువందల వారాలపాటు కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ప్రపంచంలో ఎవ్వరూ ఇంత సుదీర్ఘకాలంపాటు నిరాహారదీక్ష చేయలేదు. ఆ తరువాత షర్మిలా తన పోరాట మార్గాన్ని మార్చి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమెకు 90 ఓట్లు మాత్రమే రావడంతో తీవ్రంగా నిరాశ చెందారు. ప్రజలపై నమ్మకం పోయిందని కూడా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంకోసం అన్నేళ్లపాటు నిరాహారదీక్ష చేసిన తన పట్ల ప్రజల తీరు చూశాక ఆమె బాగా కలత చెందారు. ఇప్పుడు వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టి తన స్నేహితుడిని వివాహమాడారు.