ఎలక్షన్ కావటమే తరువాయి షర్మిల పెళ్లి

Update: 2017-02-17 16:50 GMT
ఓ పక్క ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న మణిపూర్ ఉక్కు మహిళ.. తన పెళ్లి ముచ్చటను చెప్పేశారు. మానవహక్కుల కోసం అలుపెరగని రీతిలో ఏళ్లకు ఏళ్లు పోరాటం చేసిన ఆమె.. ఆ మధ్యనే తన దీక్షను విరమించి.. రాజకీయంతోనే.. తన డిమాండ్లను సాధించుకోవాలన్న నిర్ణయానికి రావటం తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపూర్ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

త్వరలో జరుగుతున్న ఈ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే తాను పెళ్లి చేసుకోనున్నట్లుగా ఆమె తాజాగా వెల్లడించారు. మణిపూర్ లోని ప్రజల  హక్కుల్ని కాలరాచే సాయుధ దళాలకు ఉండే ప్రత్యేక అధికారాల్ని రద్దు చేయాలంటూ ఇరోం షర్మిల ఎన్నాళ్ల నుంచో పోరాటం చేస్తున్నారు. 2000 నవంబరు 4న ఆమె తన నిరాహార దీక్షను ప్రారంభించి.. గత ఏడాది ఆగస్టులో తన దీక్షను విరమించారు. ఈ మధ్య కాలంలో లెక్కలేనన్నిసార్లు ఆమె అరెస్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. గోవాకు చెందిన ప్రవాసభారతీయుడు డెస్మండ్ కౌంటన్హోతో షర్మిల పరిచయం అంతకంతకూ పెరిగి చివరకు పెళ్లి వరకూ వచ్చింది. ఆత్మహత్య నేరం కింద ఆమెను ఇంపాల్ కోర్టుకు తీసుకొచ్చిన ప్రతిసారీ డెస్మండ్ వచ్చి షర్మిల దగ్గర ఉండేవారు. త్వరలో వీరిద్దరూ జీవిత భాగస్వామ్యులు కానున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News