అమెరికా ఆ చిన్న దేశాన్ని హెల్ప్ అడగడమా?

Update: 2020-03-25 16:01 GMT
కరోనాపై యుద్ధంలో చైనా పక్కనే ఉండే దక్షిణ కొరియా విజయం సాధించింది. దక్షిణ కొరియాలో 9వేల మందికి కరోనా వైరస్ సోకగా.. 125మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొరియా ప్రభుత్వం కరోనాపై పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ప్రజలకు కరోనా పరీక్షలు వేగంగా చేయడం కోసం కొరియా కంపెనీలు టెస్టు కిట్లను రూపొందించారు. రోజుకు పదివేలకు పైగా పరీక్షలు చేసే స్థాయికి కొరియా ఎదిగింది. ప్రజలకు పరీక్షలు చేిస మందులు ఇస్తూ ఆయా ప్రాంతాల్లో క్వారంటైన్ నిర్వహిస్తూ ఇప్పుడు పూర్తి స్థాయిలో అదుపు చేసింది. కొరియా తయారు చేసిన టెస్ట్ కిట్స్ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా దేశం దక్షిణ కొరియా సాయం కోరింది. అమెరికాలో ఒకే రోజు 10వేల కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 54వేలుదాటింది. మంగళవారం 785మంది వైరస్ తో చనిపోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అత్యవసర అభ్యర్థన మేరకు కరోనా వైరస్ పోరాటంలో సహకరించాలని దక్షిణ కొరియా దేశాన్ని కోరారు. దీనికి పూర్తి సహకారం అందిస్తామని కొరియా తెలిపింది.

కొరియా సంస్థల అనుమతికి సహకరిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. దక్షిణ కొరియా రూపొందించిన కరోనా వైరస్ నిర్ధారణ కిట్ లకు తాజాగా అమెరికా ఎఫ్డీఏ ఆమోదం తెలిపింది. కొరియా రూపొందించిన కిట్స్ ద్వారా అత్యంత వేగంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి రోగాలు అదుపు చేయవచ్చు. దీంతో ప్రపంచ పెద్దన్న అమెరికా సైతం చిన్న దేశం కొరియాను అభ్యర్థించక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇక ఇప్పటికే కరోనాను అదుపు చేసిన చైనా సాయం మాత్రం అమెరికా కోరకపోవడం గమనార్హం. చైనాతో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్న అమెరికా కరోనాపై పోరాటంలో చైనా సాయం తీసుకోవద్దని డిసైడ్ అయ్యి కొరియా దేశాన్ని అభ్యర్థించింది.
Tags:    

Similar News