రాజ్యసభకు నామినేట్ అయిన మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల స్థానంలో సీఎం జగన్ కొత్త వారిని మంత్రులుగా నియమిస్తారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు అది ఇప్పుడు నిజం కాబోతోంది. తాజాగా రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ చేయడానికి సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇటీవలే మోపిదేవి, పిల్లి సుభాష్ లు మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసింది. ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ అషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణ మాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం అందుతోంది.
శ్రావణ మాసం ఈనెల 21 నుంచి ప్రారంభమవుతుంది. ఈనెల 22న మంచి ముహూర్తం ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు బీసీలే. దీంతో కొత్త మంత్రులను బీసీ వర్గం నుంచే తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ కూడా వారికే అవకాశం ఇస్తారని అంటున్నారు. ఈ మేరకు బీసీ ఎమ్మెల్యేలు గంపెడాశలు పెట్టుకున్నారు.