సోషల్ మీడియాలో ముఖ చిత్రాన్నే మార్చే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతోంది. అదో వైరల్ కూడా.. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ తన ఫొటోను మార్చి జాతీయ జెండాను పెట్టుకొని దేశంలోని పౌరులంతా తమ సోషల్ మీడియా ఖాతాలను మార్చుకోవాలని పిలుపునిచ్చాడు. దీంతో ఇప్పుడు ఇదో ట్రెండ్ గా మారింది.
ఫాదర్స్ డే వస్తే తండ్రి ఫొటో.. మదర్స్ డేకు తల్లి ఫోటో.. ఫ్రెండ్ షిప్ డేకు దోస్తుల ఫొటోలు డీపీగా పెట్టుకొని నెటిజన్లు జరుపుకుంటారు. తమ వారిపై అభిమానం చూపుతుంటారు.వీరికి నిజంగానే తల్లిదండ్రులు, స్నేహితులపై అభిమానం ఉందా? అంటే అంతగా ఉండకుండా సోషల్ మీడియాలో షో చేస్తుంటారు.
ఇప్పుడు ప్రధాని మోడీ ఏ క్షణాన దేశ ప్రజలంతా ఇళ్లపై జెండాలు ఎగురవేయాలని.. తమ సోషల్ మీడియా ఖాతాల డీపీలను జాతీయ జెండాగా మార్చుకోవాలని పెట్టాడో అప్పటి నుంచి వైరల్ అవుతోంది. మోడీ చెప్పిందే తడువుగా సోషల్ మీడియాలో అందరూ తమ ఫొటోలు తీసేసి జాతీయ జెండాను ఫొటోగా పెట్టుకున్నారు.
ఇప్పటికే చాలా మంది దీన్ని అమలులో పెట్టారు. అలా అమలులో పెట్టనివారిని ఏమనాలి? భక్తుల లెక్కలో వారంతా దేశభక్తి లేనివారు అనుకోవాలా? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
ప్రజల్లో డీపీల పేరిట దేశభక్తి ఉంటే సరిపోతుందా? ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండనక్కర్లేదా? అంటూ కొందరు కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధరల పెరుగుదలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పకుండా.. డీపీగా జాతీయ పతాకం పెట్టండని సాక్షాత్తూ ప్రధాని సూచించడమే కలకలం రేపింది. డీపీ మార్చడం సంగతి తర్వాత ముందు ధరలు తగ్గించండి మోడీ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
గతంలో మోడీ కరోనా వేళ చపట్లు కొట్టించి, దీపాలు వెలిగించి.. ప్లేట్లు మోగించమని చెప్పాడు. దాని వల్ల ఏం ఉపయోగం లేకున్నా మోడీ చెప్పారని ఆయన భక్తులు చేశారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు.. దేశభక్తి పేరిట బీజేపీ, మోడీ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చర్చ సమస్యలపై కాకుండా ఇతర విషయాలపై మళ్లించేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.