ట్రంప్ , కరోనా గురించి చెప్పింది నిజమైందా ... 2021 అత్యంత ప్రమాదకరమట , నోస్ర్టాడమస్ జోస్యం !

Update: 2021-01-08 12:25 GMT
నోస్ట్రడామస్‌... ప్రపంచ వ్యాప్తంగా ఈయనకి మంచి గుర్తింపువుంది. భవిష్యత్ చెప్పడంలో దిట్ట. కరోనా మహమ్మారి విషయంలోనూ ఆయన చెప్పిందే నిజమైందా, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడంటూ ఆయన చెప్పిన జోస్యం.. నిజమైంది . నోస్ట్రడామస్‌ చెప్పినట్టుగా ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడు. ఇవన్నీ నోస్ట్రడామస్‌ కరెక్ట్ గానే చెప్పాడా  అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం చెప్పాల్సిందే. అయితే , 2020 ఏడాది కంటే  2021 చాలా ప్రమాదకరం అని చెప్పాడు. 20వ శతాబ్దంలో ఏం జరుగబోతుందో 400ఏళ్ల కిందటే నోస్ట్రడామస్‌ ఊహించాడు. ఇప్పటివరకూ నోస్ట్రడామస్‌ చెప్పిన ఒక్కటీ తప్పుగా రుజువుకాలేదు.  అపోకలిప్స్, జాంబీస్ అంటూ అంతగా భయపెట్టిస్తున్న ఈ 16వ శతాబ్దపు జ్యోతిష శాస్త్రజ్ఞుడు చెప్పిన కొన్ని షాకింగ్ విషయాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ విషయంలో నోస్ట్రడామస్‌ జోస్యం నిజమైనట్టే… కరోనా విషయంలోనూ నిజమైంది. మూడో శతాబ్దంలో  నోస్ట్రడామస్‌ చెప్పిన ప్రకారం.. ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, బిడియం లేని మాటకారి, అగ్రరాజ్యాన్ని ఏలుతాడు. అతడి మాటతీరు, దురుస ప్రవర్తనతో వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తాడంటూ చెప్పుకొచ్చాడు. అంటే, ట్రంప్ విషయంలో అదే జరిగింది.

వాస్తవానికి  నోస్ట్రడామస్ చెప్పే జోస్యాలన్నీ అస్పష్టంగా ఉంటాయి. అయినప్పటికీ ఎందరో జ్యోతిష్యులు నోస్ట్రడామస్‌ 2021 చెప్పిన జ్యోసానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. నోస్ట్రడామస్‌ 2021లో జరగబోయే వాటిలో  గురించి ఆయన జ్యోసం చెప్పారు. అదే.. బయోలాజికల్ వెపన్ వైరస్.. రష్యా ఈ బయోలాజికల్ వెపన్ తయారుచేస్తోందంట.. ఈ వెపన్ నుంచి ఉత్పత్తి అయ్యే వైరస్, యావత్ ప్రపంచాన్ని అంతం చేస్తుందని జోస్యం చెప్పాడు. అంటే ఒకరకంగా కరోనా వైరస్ లాంటిదే మరో వైరస్ ఈ ఏడాది ప్రపంచం పై దాడి చేయడానికి సిద్ధంగా ఉందట. కొంతమంది యువకులకు ముందుగా ఈ వైరస్ సోకి అక్కడి నుంచి ప్రారంభమవుతుందంట. వారినుంచి ఇతరులకు వైరస్ వ్యాపిస్తుందని అక్కడి నుంచి వైరస్ విజృంభణ కొనసాగుతుందని తన పుస్తకంలో ప్రెడిక్షన్ రాసుకొచ్చారు.

2021 ఏడాదిలో ఒక్కసారిగా వాతావరణంలో భారీగా మార్పులు సంభవిస్తాయంట.. ఈ ఏడాదిలో భారీగా సౌర తుఫాన్లు సంభవిస్తాయంట.. ఈ ప్రళయం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ,భారీగా వాతావరణంలో మార్పులు వస్తాయని చెప్పారు. అలాగే యుద్ధాలు కూడా జరుగుతాయంట, భారీ తోకచుక్క ఒకటి భూమిపైకి దూసుకొస్తుందంట.. మహా ప్రళయం సంభవిస్తుందంట.. దీని ధాటికి భారీ భూకంపాలు, విపత్తులు, సునామీలు సంభవిస్తాయంట.. అలాగే ఆకాశం నుంచి ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుందంట.. 2021లో జరుగబోయే ఈ మహా వినాశనం సమయంలో ఆకాశమంతా ఎర్రబారుతుందంట.. ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే మాత్రం భారీ పేలుడు సంభవిస్తుందంట. కాలిఫోర్నియాను భారీ భూకంపం ప్రళయం సృష్టిస్తుందంట.. పశ్చిమ, లాంబార్డీ ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది.

2021లో ఈఫిల్ టవర్ కన్నా అతిపెద్ద పరిమాణంలో ఉండే ఆస్టరాయిడ్స్ భూమికి అతిదగ్గరగా దూసుకొస్తున్నాయంట. మొత్తం ఐదు ఆస్టరాయిడ్లు భూ వాతావరణంలోకి అతిచేరువగా రానున్నాయి. అందులో రెండు ఈఫిల్ టవర్ కంటే అతిపెద్దదిగా ఉన్నాయంట.. ఫ్రెంచ్ ఖగోళవేత్త నోస్ట్రడామస్‌ చెప్పిన జోస్యం అక్షరాలా నిజం అవుతుందా, అనే భయాందోళన నెలకొంది. అంటే.. భూమిపైకి దూసుకొచ్చే ఈ ఐదు ఆస్టరాయిడ్స్ భూగ్రహాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉందా, లేదా అనేది స్పష్టత లేదు. అలా జరిగితే మహా ప్రళయం సంభవిస్తుందా, అనే భయాందోళన వాతావరణం నెలకొంది. 2021లో ఐదు ఆస్టరాయిడ్స్ జనవరి నెలలో భూమికి దగ్గరగా వస్తున్నాయంట. ఇందులో మూడు ఆస్టరాయిడ్స్ చిన్నగా ఉంటే.. మిగిలిన రెండు ఆస్టరాయిడ్స్ మాత్రం అతిపెద్ద (324 మీటర్లు) పరిమాణంలో ఉన్నాయంట.. ఇదివరకే నోస్ట్రడామస్‌ 2021లో ఆస్ట్రరాయిడ్స్ భూమికి దగ్గరగా వస్తాయని జోస్యం చెప్పారు. 465 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్‌ తన రాసిన పుస్తకంలో వేలాది ప్రెడిక్షన్స్ చెప్పారు.
Tags:    

Similar News