సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వచ్చే 2024 ఎన్నికలకు రెడీ అయిపోయారు. విశాఖ పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా.. తన కుమార్తె ప్రియాంక దండి.. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలను కూడా కలుస్తున్నామని వివరించారు. అయితే.. పార్టీల తరఫున కాకుండా.. స్వతంత్రంగానే తాము బరిలో నిలబడుతున్నామని వెల్లడించారు.
అయితే.. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. విశాఖను పాలనా రాజధాని చేయాలని తలపోస్తున్న అధికార పార్టీ వైసీపీ విశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో.. ఇక్కడ వైసీపీవిజృంభణ ఓ రేంజ్‌లో ఉండనుంది. ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గత వైసీపీ హవాలోనే ఇక్కడ నాలుగు నగర నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకుంది. మరో వైపు.. జనసేన ప్రభావం, బీజేపీ దూకుడు కూడా ఎక్కువగానే ఉండనున్నాయి. దీనిని బట్టి బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేనల రాజకీయాలు విశాఖలో పెరగనున్నాయి.
ఇలాంటి కీలకమైన జిల్లాలో జేడీ స్వతంత్రంగా పోటీ చేసి.. సాధించేది పెద్దగా ఏమీ ఉండదని.. ఆయన కు ఒరిగేది కూడా ఏమీ ఉండదని అంటున్నారు మేధావులు. రాజకీయాలు చేయడమే కాదు.. ముందు చూపు. వచ్చే ఎన్నికలపై అంచనా కూడా ఉండాలనేది వీరి సూచన. పైగా సిద్ధాంత.. అభ్యుదయ రాజకీయాలు ఎంచుకున్న నేపథ్యంలో ఆయా పార్టీలు బలంగా లేని నియోజకవర్గాలను ఎంచుకుని.. చదువుకున్నవారు.. మేధావులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుని ఉంటే బాగుండేదని సూచిస్తున్నారు.
ఇక, ఎన్నికలు ఎంత మార్చాలని అనుకున్నా మారే పరిస్థితిలేదు. కులంతోను.. మతంతోనూ.. రిజర్వేషన్‌లతోననూ ముడిపడిపోయిన నేపథ్యంలో దానికి తగిన విధంగా జేడీ తన ఎంపిక ను చేసుకుని ఉంటే బాగుండేదని సూచిస్తున్నారు. ఎంపికలోనే.. బలమైన నియోజకవర్గాలు.. జిల్లాను ఎంపిక చేసుకుని ఇబ్బందులు పడడం తప్ప.. సాధించేది ఏమీ లేదని చెబుతున్నారు. మరి జేడీ వ్యూహం ఏంటో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.