కేంద్రంలో కేసీఆర్ కోటా.. నాలుగు మంత్రి పదవులా!

Update: 2019-04-16 08:06 GMT
ఇప్పటికైతే పోలింగ్ పూర్తి అయ్యింది. ఫలితాలైతే ఇప్పుడప్పుడే రావు. ఇంకా నాలుగు వందలకు పైగా లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ.. ఇంతలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తన లెక్కల్లో తను ఉన్నారట. కేంద్రంలో హంగ్ తరహా పరిస్థితి వస్తుందని, ప్రాంతీయ పార్టీల బలమే కేంద్రంలో కీలకం అవుతుందని, పదహారు ఎంపీల బలం కలిగిన తెరాస కూడా  కేంద్రంలో చక్రం తిప్పుతుందని కేసీఆర్ అంటున్నారట.

పదహారు మంది ఎంపీలతో  కేంద్రంలో కనీసం నాలుగు మంత్రి పదవులను సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్ తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎలాగూ తెరాసకు రాజ్యసభలోనూ బలం ఉంది. అది ముందు ముందు మరింత పెరగొచ్చు. కాబట్టి..కేంద్రంలో చక్రం తిప్పేందుకు మరింతగా అవకాశం ఏర్పడుతుందని.. నాలుగు మంత్రి పదవులను తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్ అంటున్నారట.

ఏదేమైనా వచ్చే సారి కేంద్రంలో అధికారాన్ని పంచుకోవాలని మాత్రం కేసీఆర్ గట్టిగా అనుకుంటున్నారట. గత ఐదేళ్లలో అవకాశం కాస్తో కూస్తో ఉన్నా కేసీఆర్ కేంద్రంలో అధికారాన్ని పంచుకునేందుకు వెళ్లలేదు. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మోడీ ప్రభుత్వంలో కేసీఆర్ చేరలేదు. ఈ సారి మాత్రం కేంద్రంలో కూడా అధికార పక్షంలో భాగస్వామి అయ్యేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నట్టున్నారు!
    

Tags:    

Similar News