మాటలు నేర్చిన చిలుక ఏమైనా చెప్పినట్లుగా.. రాజకీయ నేతలు తమ తప్పుల్ని.. వైఫల్యాల్ని కప్పి పుచ్చుకోవటానికి వీలుగా వినిపించే వాదనలు కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని సమయాల్లో తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునే తీరు చూస్తే.. వారి తెలివికి మచ్చట పడాల్సిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు కోపం వచ్చింది. తమనుఅదే పనిగా టార్గెట్ చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలపై ఆయన గరంగరంగా ఉన్నారు. తమను అదే పనిగా వేలెత్తి చూపుతున్న ప్రభుత్వ విధానాలపై తాజాగా ఆయన విరుచుకుపడ్డారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయలేదంటూ కేసీఆర్ సర్కారుపై బీజేపీ నేతలు టార్గెట్ చేయటాన్ని తప్పు పట్టిన కేటీఆర్.. అనూహ్యంగా ఇటీవల చోటు చేసుకున్న ఒక విషాదాన్ని ప్రస్తావిస్తూ.. దానికి బాధ్యులుగా బీజేపీనే అంటూ అభివర్ణించారు. ఇటీవల సునీల్ నాయక్ అనే సోదరుడు సూసైడ్ చేసుకున్నాడని.. అతని వీడియో తాను చూసినట్లు చెప్పారు మంత్రి కేటీఆర్.
ఆ వీడియోలో తాను ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సిన వాడినని చెబుతాడు.. ఐఏఎస్ ఆఫీసర్ల నోటిఫికేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? సునీల్ లాంటి అమాయకుల్ని బ్రెయిన్ వాష్ చేసి తప్పుదారి పట్టిస్తున్నట్లుగా కేటీఆర్ అన్నారు. చదువు సంధ్యా లేని నేతల నోటి నుంచి ఇలాంటిమాటలు వస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ.. అమెరికాలో ఉండి చదువుకొని.. ఉద్యోగం చేసిన కేటీఆర్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటం నిజంగానే బ్యాడ్ లక్.
రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. కానీ.. మాట్లాడే మాటలు సరిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు సునీల్ నాయక్ సూసైడ్ ను ప్రస్తావించి.. అతడి మరణాన్ని కేంద్రం ఖాతాలో వేసిన తెలివిని మెచ్చుకోవాల్సిందే. అయితే.. అందుకు చెప్పిన లాజిక్ ఏ మాత్రం సూట్ కాకపోవటమే కాదు.. నవ్వుల పాలయ్యేలా ఉందని చెప్పాలి. ఎందుకంటే.. ప్రతి ఏటా సివిల్స్ పరీక్షల్ని క్రమం తప్పకుండా కేంద్రం నిర్వహిస్తోంది. అలాంటప్పుడు సునీల్ నాయక్ ఐఏఎస్ కాలేదంటే.. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయకపోవటం కారణం కాదు. ఆ తర్వాతి స్తాయిలో ఉన్న గ్రూప్ వన్.. గ్రూప్ 2 లాంటివి కేంద్రం మాదిరి ప్రతి ఏడాది నిర్వహించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది.
మనిషి చనిపోయిన తర్వాత కూడా అతడి వేదనను తమకు తగ్గట్లుగా వాదన వినిపించటం మంచి రాజకీయం అనిపించుకోదు. అందునా.. కేటీఆర్ లాంటి నేత నోటి నుంచి ఇలాంటి మాటలు సరికాదని చెప్పాలి. భారీ లాజిక్ ఏదో గుర్తించినట్లుగా కమలనాథులపై విరుచుకుపడే ముందు.. కేటీఆర్ కాస్తైనా ఆలోచించి ఉంటే బాగుండేదన్నమాట వినిపిస్తోంది.