భీమ్లా నాయ‌క్ : ఎంఆర్వోలే అంతా చేస్తున్నారా?

Update: 2022-02-26 05:36 GMT
నిత్యావ‌స‌ర స‌ర‌కులు ధ‌ర‌లు పెరిగితే నో ఎంఆర్వో నో పోలీస్ అంటూ జ‌న‌సేన మండిపడుతోంది.కానీ థియేట‌ర్ ద‌గ్గ‌ర నాలుగు షోల‌కూ అమ్మ‌కాలు ఎలా సాగాయో అని ప‌డిగాపులు కాయ‌డంలో మాత్రం స్వామి భ‌క్తి  చాలా బాగుంది అని అంటూ పెద‌వి విరిస్తోంది.ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో.. ఎంఆర్వో అంటే మండ‌ల రెవెన్యూ ఆఫీస‌ర్ కాదు మూవీ రెవెన్యూ ఆఫీస‌ర్ అని వ్యంగ్య భాష్యం ఒక‌టి చెబుతోంది కూడా!

ఎంఆర్వోల‌కు రాజ‌కీయ ఉద్దేశాలు ఎందుకు అందించారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.ఇదే స్పీడు,ఇదే స్పిరిటు..నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో ఎందుకు లేదు.బాగుంది.ఆయ‌న చెప్పారు మేం  చేస్తున్నాం అని నెపం సీఎం పై బాగానే నెడుతున్నారు కానీ థియేట‌ర్ల ద‌గ్గ‌ర మీకు ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌మ‌ని జ‌గ‌న్ చెప్పారా? ఎందుకు చెబుతారు? నోటికి వ‌చ్చిన విధంగా అభిమానుల‌ను తిట్ట‌మ‌ని పోలీసోళ్ల‌కు జ‌గ‌న్ చెప్పారా? ఎందుకు చెబుతారు? ఇవే నిజం అయితే ఇంత‌కుమించిన దౌర్భాగ్యం ఇంకొక‌టి ఉండ‌దు అని జ‌న‌సేన కార్య‌కర్త‌లు మ‌నో వేద‌న చెందుతూ వ్యాఖ్యానిస్తున్నారు.అఖండ సినిమా విష‌య‌మై ఇలానే ప్ర‌వ‌ర్తించారా?

ఆ విధంగా ఆ రోజు ఎందుకు ఇంత‌గా పోలీసులు రెచ్చిపోలేదు.ఎంఆర్వోలు టికెట్ కౌంట‌ర్ల ద‌గ్గ‌ర నిల‌బ‌డి అమ్మ‌కాలు సాగించ‌లేదు అని ప్ర‌శ్నిస్తున్నారు జ‌గ‌న్ ను జ‌న సైనికులు.

ఎంఆర్వోలు ఏపీలోఅతి చేస్తున్నారు. తెలంగాణ లో అతి చేయ‌కుండా ఉన్నారు.కార‌ణం ప‌వ‌న్ అంటే అకార‌ణ ద్వేషం ఒక‌టి ఏపీ స‌ర్కారు వాళ్ల‌కు ఏమయినా నూరిపోసిందా? నిబంధ‌న‌లు లేవు స‌రే..థియేట‌ర్ ఆపేశారు సరే! అన్ని సినిమాల‌కూ ఇదేవిధంగా మాట్లాడితే బాగుంటుంది క‌దా! అన్న‌ది జ‌న‌సేన అభిమానుల మాట.కానీ ఇవ‌న్నీ రాజ‌కీయ ఒత్తిళ్ల కార‌ణంగానే చేస్తున్నార‌న్న‌ది ఓ వాస్త‌వం.అయితే జ‌గ‌న్ మ‌రీ ఇంత ప‌ట్టుద‌లగా ఎందుకు ఉంటున్నారు.ప‌వ‌న్ ఓటు బ్యాంకు కార‌ణంగా వైసీపీ ఏమ‌యినా ఓడిపోతుంద‌ని ఎవ్వ‌ర‌యినా సీఎంకు నివేదిక ఇచ్చారా లేదా టీడీపీతో స్నేహం ఉంది క‌నుక కోపం క‌ట్ట‌లు తెంచుకుని రంకెలు వేయ‌మ‌ని చెబుతుందా?

ఈ నేప‌థ్యంలో.. నిన్న‌టి వేళ భీమ్లా నాయ‌క్ సినిమా ప్ర‌పంచం అంత‌టా విడుద‌ల‌యింది.ఏపీ,తెలంగాణ‌లో హిట్ టాక్ తెచ్చుకుంది .కానీ ఈ సిని మా విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు న‌డుచుకుంటున్న తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ఈ సినిమా విష‌యంలో నిబం ధ‌న‌ల పేరిట థియేట‌ర్ల‌ను మూసి వేయించిన ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం కూడా చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల జీఓ నంబ‌ర్ 35ను అమ‌లు చేయాల‌ని చెబుతూ త‌హ‌శీల్దార్లు బుకింగ్ కౌంట‌ర్ల ద‌గ్గ‌ర  ఉండిపోయారు.దీంతో బీ,సీ సెంట‌ర్లు సినిమాను న‌డ‌ప‌కుండానే మూసేశాయి.ఆఖ‌రికి ప‌వ‌న్  క‌ల్యాణ్ అభిమానుల ఒత్తిడి మేర‌కు మ‌ళ్లీ థియేట‌ర్ల‌ను ఓపెన్ చేశారు.
Tags:    

Similar News