దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే అవకాశం ఉందని అంచనా వేసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అలాంటి పరిస్థితినే తీసుకొచ్చాయి. ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది. ఐదో రాష్ట్రమైన పంజాబ్ మీద మొదట్నించి ఆశలు లేనందున.. ఆ పార్టీ బాధ పడాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రబలమైన శక్తిగా మారిస్తే.. కాంగ్రెస్ పార్టీకి భారీ షాకింగ్ గా మారాయి. ఇప్పుడా పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. తాజా ఎన్నికల ఫలితల నేపథ్యంలో తమకు అవకాశం ఉన్న రాష్ట్రాల మీద బీజేపీ ఇప్పుడు దృష్టి పెడుతోంది.
ఉత్తర భారతంతో పాటు ఈశాన్య భారతంలోనూ తన సత్తా చాటుతున్న కమలనాథులకు ఎంతకు కొరుకుడుపడనిదిగా మారింది దక్షిణ భారతం. కాస్తో కూస్తో కర్ణాటక మినహాయిస్తే.. ఆ పార్టీకి చెప్పుకోదగిన బలం లేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడా పార్టీకి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే.. తెలంగాణ అధికారపక్షం దూకుడుకు కళ్లాలు వేసేలా ఇంతవరకు బీజేపీ అధినాయకత్వం చేసిందేమీ లేదు. దీంతో.. ఢిల్లీ నాయకత్వం నుంచి అండ కోరుకుంటున్న రాష్ట్ర నాయకత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే.. తమ సత్తా చాటుతామన్న మాటను చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీలోనూ తమ సత్తా చాటాలని బీజేపీ తపించినా.. ఆ పార్టీకి అంత సీన్ లేదన్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ బలంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న మాటను చెబుతోంది విపక్ష టీడీపీ. మూడో శక్తిగా మారిన జనసేనతో చేతులు కలిపి దోస్తీ చేస్తున్న బీజేపీ.. పవన్ పేరుతో తమ ఉనికిని విస్తరించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తమతో పోలిస్తే పవన్ కల్యాణ్ కే ఎక్కువ ఛరిష్మా ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ -జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను డిసైడ్ చేయాలన్న మాట బీజేపీకి చెందిన ముఖ్యనేతలు కొందరు అధినాయకత్వాన్ని ఒప్పిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఏపీలో ఉన్న పరిమితుల నేపథ్యంలో పవన్ ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. రాష్ట్రంలో బీజేపీ పాగా వేయటంతో పాటు.. తమ బలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందన్న మాటను చెబుతున్నారు. అయితే.. ఇందుకు పవన్ ఏమంటారు? అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే.. పేరుకు మిత్రుడే కానీ.. బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ పొందిన ప్రయోజనం అంటూ ఏమీ లేదు. తనను ఒంటరిని చేసి టార్గెట్ చేస్తున్న వేళలోనూ.. బీజేపీ అధినాయకత్వం నుంచి కానీ రాష్ట్ర నాయకత్వం నుంచి కానీ ఎలాంటి దన్ను లభించలేదన్నది వాస్తవం. ఇలాంటి వేళలో బీజేపీతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళతారా? అన్నది ప్రశ్న.
బీజేపీలోని మరో వర్గం అంచనా ప్రకారం చూస్తే.. ఎన్నికల సమయానికి విపక్ష టీడీపీతో చేతులు కలుపుతారని.. ఈ ఇరువురి జట్టుతో రాష్ట్రంలో అధికారంలోకి రావలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. పవన్ ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటానికి బీజేపీ ముఖ్యనేతలకు ఎలాంటి అభ్యంతరం లేదన్న మాట వినిపిస్తోంది. కమలనాథులు తయారుగా ఉన్నా.. పవన్ కల్యాణ్ ఇందుకు ఓకే చెబుతారా? అన్నది అసలు ప్రశ్న. మరికొద్ది రోజుల్లో జనసేన ఆవిర్భావ సభను భారీగా నిర్వహించటం.. ఆ సభకు వేలాదిగా వచ్చేలా ప్లాన్ చేస్తున్న జనసేనాని.. తనకున్న క్రేజ్ ఎంతన్న విషయాన్ని మరోసారి నిరూపిస్తారంటున్నారు.
అయితే.. వెల్లువెత్తే ప్రజాభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవటంలో విఫలమవుతున్న జనసేనకు దన్నుగా నిలవాలన్నది బీజేపీ నేతల ఆలోచనగా చెబుతున్నారు. అయితే.. ఎన్నికల సమయానికి టీడీపీ - జనసేన పొత్తు విషయంపై నెలకొన్న కన్ఫ్యూజన్ తొలిగితే.. బీజేపీ మరింత దూకుడు ప్రదర్శిస్తుందన్న మాట వినిపిస్తోంది.